కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పెంచుకోవాలి

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రతినిధి ఇయాన్‌ కౌలీ

చేబ్రోలు: విద్యార్థులు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను సమర్థంగా వినియోగించుకునేలా అభ్యసించాలని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ మల్టీ– లెవల్‌ టెస్టింగ్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఇయాన్‌ కౌలీ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని కేంబ్రిడ్జ్‌ ఆథరైజ్డ్‌ ఎగ్జామ్‌ సెంటర్‌– ఐఎన్‌269 ఆధ్వర్యంలో ‘అస్సెసింగ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌: బియాండ్‌ ట్రెడిషనల్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌’ అనే అంశంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇయాన్‌ కౌలీ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచంలో విద్య, ఉపాధి, అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. భాషా పరిజ్ఞానంతో పాటు వాస్తవ జీవిత పరిస్థితుల్లో వ్యక్తి తన ఆలోచనలను ఎంత స్పష్టంగా, సమర్థంగా వ్యక్తీకరించగలడన్నది కూడా ముఖ్యమన్నారు. విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల భవిష్యత్‌ అవకాశాలను విస్తరించడంలో ఆంగ్ల భాష, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఎంతో కీలకమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement