భగవాన్‌ విశ్వకర్మ జయంతి | - | Sakshi
Sakshi News home page

భగవాన్‌ విశ్వకర్మ జయంతి

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

నగరంపాలెం: భగవాన్‌ విశ్వకర్మను దైవిక శిల్పి, వాస్తుశిల్పి, సృష్టి నిర్మాణకర్తగా పూజిస్తారని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. గురువారం నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో విశ్వకర్మ జయంతి(విశ్వకర్మ పూజ) వేడుకలు జరిగాయి. తొలుత భగవాన్‌ విశ్వకర్మ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాల వేయగా, పోలీస్‌ అధికార, సిబ్బందితో ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ(పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు అళహరి శ్రీనివాస్‌ (ఎస్‌బీ), సంకురయ్య(ఏఆర్‌), ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి కృష్ణయ్య పాల్గొన్నారు.

జెడ్పీలో విశ్వకర్మ జయంతి

గుంటూరు ఎడ్యుకేషన్‌ దేవతల వాస్తుశిల్పి, సృష్టికర్త భగవాన్‌ విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని గురువారం సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి జెడ్పీ డెప్యూటీ సీఈలో సీహెచ్‌ కృష్ణ, అకౌంట్స్‌ అధికారి శామ్యూల్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement