ప్రజలకు మళ్లీ ‘నివాస’ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మళ్లీ ‘నివాస’ కష్టాలు

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

ప్రజలకు మళ్లీ ‘నివాస’ కష్టాలు ప్రత్తిపాడు: చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. పోయిన కష్టాలను మళ్లీ తిరిగి జనం నెత్తిన మోపేందుకు సిద్ధమయ్యింది. 2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిన రెసిడెన్స్‌ సర్టిఫికెట్ల జారీని, మళ్లీ పునరుద్ధరిస్తూ ప్రజలకు కొత్త కష్టాలను షురూ చేసింది. తాజాగా రెసిడెన్స్‌ సర్టిఫికెట్ల జారీ అధికారాన్ని తహసీల్దార్లకు ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఈ నెల 16వ తేదీన జారీచేసింది. రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ కావలసిన వారు ఆధారాలతో సహా దరఖాస్తులను తహసీల్దారుకు సమర్పించాలి. ఎలాంటి ఆధారాలు లేని సందర్భంలో దరఖాస్తుదారులు తహసీల్దారుకు లిఖితపూర్వకంగా అర్జీ పెట్టుకోవాలి. తహసీల్దార్‌ స్థానికంగా విచారణ జరిపి నివాసాన్ని ధ్రువీకరించిన అనంతరం నివాస ధ్రువీకరణ పత్రం జారీచేస్తారు. ఈ మేరకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ జీవో నంబర్‌ 592తో ఉత్తర్వులు జారీ చేశారు. నివాస ధ్రువీకరణ పత్రాలకు బదులు ప్రత్యామ్నాయంగా ఆధార్‌, రేషన్‌ కార్డులను పరిగణించాలని సూచిస్తూ, రెసిడెన్స్‌ సర్టిఫికెట్లు జారీ ప్రక్రియను 2015 జూన్‌ నెలలో రద్దు చేస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబర్‌ 581తో ఉత్తర్వులిచ్చింది. నాటి నుంచి నివాస ధ్రువీకరణ పత్రాల జారీ పూర్తిగా నిలిచిపోయింది. తాజాగా మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకుంది. మళ్లీ నివాస ధ్రువీకరణ పత్రాలను పునరిద్ధరిస్తూ చంద్రబాబు సర్కారు రెండు రోజుల కిందట జీఓ జారీ చేసింది. విద్య, ఉద్యోగాలు, ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌, ఓటరు జాబితాల సవరణ, స్థానిక గుర్తింపు కోసం ప్రజలకు నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం, క్యూఆర్‌ కోడ్‌తో సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. అయితే వీటి జారీ ప్రక్రియను మరలా పాత పద్ధతిలో తహసీల్దార్లకే అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు కోసం ఇప్పటికే ప్రజలు, విద్యార్థులు రోజుల తరబడి తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఉంది. ఈ తరుణంలో మళ్లీ రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ కోసం కూడా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందా అనే చర్చ ప్రజల్లో మొదలైంది. గతంలో ఈ సర్టిఫికెట్‌ కోసం నెలల తరబడి తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. మరలా అవే పాత కష్టాలు మొదలవుతాయని ఆందోళన చెందుతున్నారు. అయోమయంలో ప్రజలు

రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. విద్య, ఉద్యోగాలకు దాదాపుగా రెసిడెన్స్‌ సర్టిఫికెట్లతో అవసరం లేదు. రేషన్‌, ఆధార్‌కార్డుతో పాటు 10వ తరగతి సర్టిఫికెట్‌లపైనే చిరునామాతో సహా అన్ని వివరాలు ఉంటాయి. అయినప్పటికీ మళ్లీ పదకొండేళ్ల తర్వాత రెసిడెన్స్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పునరుద్ధరించడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఆధార్‌, రేషన్‌ కార్డులను ఇకపై నివాస ధ్రువీకరణగా పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

రెసిడెన్స్‌ సర్టిఫికెట్ల

జారీని పునరుద్ధరిస్తూ జీఓ జారీ

తహసీల్దార్ల ద్వారా మంజూరుకు

ఉత్తర్వులు

2015లో జీఓ 581తో రెసిడెన్స్‌

సర్టిఫికెట్ల మంజూరు నిలిపివేస్తూ

ఆదేశాలు జారీ చేసిన అప్పటి

చంద్రబాబు ప్రభుత్వం

తాజాగా ఇప్పుడు పునరుద్ధరిస్తూ

జీఓ 592 జారీచేసిన వైనం

మళ్లీ జనం నెత్తిన కొత్త తిప్పలు,

పాత కష్టాలు

యూటర్న్‌తో జనానికి తిప్పలు

మళ్లీ రెవెన్యూ కార్యాలయాల బాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement