దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యం

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యం

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

ప్రతి అర్జీని పరిష్కరిస్తాం

పరిష్కరించలేవి ఉంటే

ఫిర్యాదుదారులకు వివరిస్తాం

ప్రతి సోమవారం నిర్వహించే

పీజీఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

కొల్లిపర: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఒక నెల– ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ తెలిపారు. గురువారం కొల్లిపరలో జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి కలెక్టర్‌ అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలోనే నెలకు నాలుగు సార్లు అధికారులు సందర్శించడం వలన ప్రజలు స్థానికంగానే అర్జీల పరిష్కారం వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రజల అర్జీలకు వారి సమక్షంలోనే నాణ్యమైన పరిష్కారం కూడా లభిస్తుందన్నారు. మున్నంగి గ్రామానికి చెందిన బొంతు అశోక్‌రెడ్డితో పాటు కొంత మంది కొల్లిపర వయా తెనాలి, హైదరాబాదు ఆర్‌టీసీ ఏర్పాటు చేసిన బస్సు సరిగా లేదని దాని కాలపరిమితి ముగిసిపోయిందని, ఆ బస్సు మార్చాలని కోరారు. కొల్లిపరలో రజకులకు చెందిన స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకుని ఉన్నారని ఆ స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం జరగకుండా ఆక్రమించుకున్నవారు అడుపతున్నారని ఈ విషయం తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదుని కొల్లిపర రజక సంఘం నాయకుడు వెంకటేశ్వరరావు కలెక్టర్‌ వివరించాడు. కలెక్టర్‌ స్పందించి తహసీల్దార్‌ను స్వయంగా వెళ్లి పరిశీలించి సమస్య పరిష్కరించాలని, లేదా తగు నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రజల వద్ద నుంచి 78 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసిన ప్రదర్శన, విక్రయాలను జిల్లా కలెక్టర్‌ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీరమణి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, ఆర్టీఓ కె శ్రీహరి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జె పార్థసారథి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్‌ శైలజ, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్‌ కె.కళ్యాణ చక్రవర్తి, విద్యుత్‌ శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ సీహెచ్‌.రమేష్‌, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సహాయ సంచాలకులు పి.సత్యనారాయణ, తెనాలి మున్సిపల్‌ కమిషనర్‌ జె రామ అప్పలనాయుడు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి.శంకర్‌, తహసీల్దార్‌ సిద్ధార్థ, ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement