గుంటూరు వెస్ట్ (క్రీడలు): కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఏపీ వైస్ చైర్మన్‌గా కనమర్లపూడి సత్యనారాయణను నియమించారు. గురువారం స్థానిక విశ్రాంత ఎస్పీ సిహెచ్ చక్రపాణి గృహంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సొసైటీ సభ్యుడిగా చక్కని సేవలందించిన సత్యనారాయణ నిబద్ధతను చూసి వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశామన్నారు. సమాజంలో క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడల అభివృద్ధికి తమ సొసైటీ కృషి చేస్తుందన్నారు. సత్యనారాయణకు విశ్రాంత ఎస్పీ చక్రపాణి చేతులమీదుగా నియామకపత్రాలను అందజేసారని చెప్పారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు, ఎస్.ప్రసాద్, నాగరాజు, విజయలక్ష్మి పాల్గొన్నారు.


