అయ్యో..‘పాప’ం ..!
ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నారిని చూడండి. ఈ పాపకు పట్టుమని ఆరేడేళ్లు కూడా ఉండవు. బడిలో పుస్తకాలతో, ఇంటి వద్ద ఆట బొమ్మలతో, కల్మషం లేని చిరునవ్వులతో సరదాగా ఆడుకోవాల్సిన పసిప్రాయం. కానీ ఆ చిన్నారి చేతిలో నెలల పసికందుతో బతుకు పోరు సాగిస్తోంది. గుక్కపట్టి ఏడుస్తున్న శిశువును లాలిస్తూ భిక్షాటన చేస్తున్న చిన్నారి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో కనిపించింది. అలసిపోయి దుకాణాల ఎదుటనే కూర్చుని ఏడుస్తున్న శిశువుని ఓదార్చుతున్న చిన్నారిని చూసిన వారంతా అయ్యో ‘పాప’ం అంటూ.. తమకు తోచిన సాయం అందించారు. ఆటపాటలు, అల్లరి పనులతో అందంగా సాగిపోవాల్సిన బాల్యాన్ని ఇలా యాచన బాటలో చూడడం బాధ కలిగిస్తోంది.
– ప్రత్తిపాడు
అయ్యో..‘పాప’ం ..!
అయ్యో..‘పాప’ం ..!


