క్రీస్తు జననం..లోకానికి పర్వదినం
ఏసు క్రీస్తు జన్మదినాన్ని విశ్వాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి నుంచి గుంటూరు నగరంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురువారం ఉదయం విశ్వాసులు పెద్ద ఎత్తున తరలిరావడంతో చర్చిల వద్ద సందడి నెలకొంది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్దలు వాఖ్య పరిచయం చేశారు. ఫిరంగిపురంలో మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు


