గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Nov 21 2025 7:25 AM | Updated on Nov 21 2025 7:27 AM

శుక్రవారం శ్రీ 21 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 దేవాలయాల ఆస్తుల కోసం టీడీపీ నాయకుల కుయుక్తులు హామీలకే పరిమితం నరేంద్రస్వామికి ప్రత్యేక పూజలు స్పర్శలేని మచ్చలను గుర్తించాలి వీఐపీల రాకపోకలకు పోలీసులు కాపలా 26న ఓపీ పీఎస్‌ పునర్నిర్మాణానికి భూమిపూజ కష్టాల ‘ప్రయాణం’

న్యూస్‌రీల్‌

గీతామందిరం ఆస్తులపై అక్రమార్కుల కన్ను ‘కమిటీ’ విషయం కోర్టులో ఉన్నా బరితెగింపు తమ ఇష్టానుసారం కొత్త కమిటీ వేస్తామని హెచ్చరిక స్థానిక ఎమ్మెల్యే అండతో చెలరేగిపోతున్న పచ్చ బ్యాచ్‌ ఆర్యవైశ్య మహాసభ వారిని కలవొద్దని ఆశావహులకు వార్నింగ్‌ రోజురోజుకు ముదురుతున్న మందిరం వ్యవహారం ఆర్యవైశ్య వర్గీయులతోపాటు నగర ప్రజలూ ఆగ్రహం

శుక్రవారం శ్రీ 21 శ్రీ నవంబర్‌ శ్రీ 2025
దేవాలయాల ఆస్తుల కోసం టీడీపీ నాయకుల కుయుక్తులు
హామీలకే పరిమితం

7

పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రులోని బాలా త్రిపురసుందరి సమేత రాజరాజ నరేంద్రస్వామి ఆలయంలో కార్తికమాసం చివరిరోజు గురువారం ప్రాతఃకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఫిరంగిపురం: ఫిరంగిపురంలో కుష్ఠు వ్యాధిపై సర్వే తీరును గురువారం స్టేట్‌ సర్వేలెన్స్‌, ఇన్‌చార్జి లెప్రసీ జేడీ డాక్టర్‌ ఉషారాణి పరిశీలించారు. స్పర్శ లేని మచ్చలను గుర్తించాలన్నారు.

తాడికొండ: ‘సాక్షి’ చొరవతో రాజధానికి వెళ్లే రహదారిపై వీఐపీలు, వీవీఐపీల రాకపోకలకు ఎట్టకేలకు కొంత ఉపశమనం కలిగింది. గుంటూరు నుంచి తుళ్ళూరు ప్రాంతానికి వెళ్లే రోడ్డుపై తాడికొండ నుంచి భారీగా గుంతలు ఏర్పడ్డాయి. లారీలూ పడిపోవడంతోపాటు గుంతల వద్ద వీఐపీలు, వీవీఐపీల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘సాక్షి’లో ‘హైకోర్టు జడ్జీలకు తప్పని ఇక్కట్లు’ పేరిట ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. మరమ్మతులు జరుగుతున్న ప్రాంతం వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు. మరమ్మతులకు అధికారులు చొరవ తీసుకోవడంతో పనులు కొనసాగుతున్నాయి. ‘సాక్షి’తో సమస్యకు కొంత ఉపశమనం కలిగిందని పలువురు ప్రశంసిస్తున్నారు.

నగరంపాలెం: గుంటూరు జీజీహెచ్‌కు కీలకమైన ఔట్‌పోస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ (ఓపీ పీఎస్‌) పునర్నిర్మాణ ం ప్రారంభం కానుంది. ఈ నెల 18వ తేదీన ‘సాక్షి’లో ‘ఖాకీలకు నిలువ నీడ కరువు’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ ఓపీ పీఎస్‌ను శంకర్‌విలాస్‌ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనుల్లో భాగంగా తొలగించనున్నారు. దీంతో కొత్తపేట పోలీసులు, ఆసుపత్రి వైద్యాధికారులు దాతలతో సంప్రదింపులు జరిపారు. నగరంపాలెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యాధికారులు ముందుకొచ్చారు. అత్యవసర సేవల చికిత్సా విభాగం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఓపీ పీఎస్‌ను నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నెల 26న భూమిపూజ చేయనున్నట్లు ఆసుపత్రి, పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి. వీలైనంత త్వరగా నిర్మించనున్నారు.

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): గత కొద్ది రోజులుగా పట్నంబజారులో ఉన్న గీతామందిరం అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఉన్న కమిటీ గడువు ముగియడంతో తమనే కొనసాగించాలని ప్రతినిధులు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమిటీ చైర్మన్‌, ఇతర పదవులు కేటాయించే అర్హత ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులకు ఉంది. దీంతో ఎంతో మంది ఆశావాహులు ఆర్యవైశ్య మహాసభ వారిని కలిసి దరఖాస్తు చేసుకునేందుకు సమయాత్తం అయ్యారు. విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు ఇలా దరఖాస్తు చేస్తే సహించబోమని ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా వార్నింగ్‌లు ఇస్తున్నారని చెబుతున్నారు.

బెదిరింపుల పర్వం...

గీతామందిరం ఆస్తులు కాజేసే కుట్రలో భాగంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే, నగర ప్రథమ పౌరుడితో కలిసి సమావేశం అయినట్లు తెలుస్తోంది. స్పష్టంగా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో కమిటీ వేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆత్మీయసభ పేరుతో సమావేశం పెట్టిన టీడీపీ నేతలు చైర్మన్‌ పదవిని ప్రకటించారు. దీనికి అడ్డు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెడతారోననే భయంతో ఆర్యవైశ్య ప్రముఖులు కూడా ముందుకు రాలేని పరిస్థితి. కోర్టులో కేసు విచారణ కొనసాగుతున్నప్పటీకీ కమిటీ వేసేందుకు సమాలోచనలు చేసినట్లు చెబుతున్నారు. పాత కమిటీ రద్దు అయినా.. కోర్టులో కేసు ఉన్నా.. ఎటువంటి తీర్పు వచ్చినా.. తాము అనుకున్నది చేస్తామని బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఈ నెల 24వ తేదీకి కోర్టు వాయిదా ఉందని పాత కమిటీ సభ్యులు చెబుతున్నారు. చట్టాలకు గౌరవం ఇచ్చి టీడీపీ నేతలు ఇకనైనా ఆగుతారో..? లేక వారి ఇష్టానుసారంగా కమిటీలు వేస్తారో..? అని ఆర్యవైశ్యుల్లో చర్చ నడుస్తోంది.

అర్చకులకూ వేధింపులు

నిత్యం అందరూ బాగుండాలని ఆకాక్షించే వారు అర్చకులు. ఆఖరికి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అర్చకులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాడ్డాయని ఆర్యవైశ్య సంఘాల వారు ఆవేదన వ్యక్తం చేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వచ్చిన భక్తులు అర్చకులకు తమకు తోచినంత కానుకలు ఇచ్చి వెళ్లడం సహజం. టీడీపీ చెందిన ఒక నేత రెండు రోజుల క్రితం ఆలయ అర్చకుడిని పిలిపించి.. ‘నాకు రూ.50 వేలు ఇవ్వాలి. రూ.2 లక్షల వరకు సంపాదించవట కదా. ఇవ్వకుంటే దేవదాయ శాఖ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసి ఉద్యోగం తీయించేస్తానని’ బెదిరింపులకు పాల్పడినట్లు ఆర్యవైశ్యులు బాహాటంగానే చెబుతున్నారు. అర్చకులను కూడా వదలిపెట్టడం దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం, గీతామందిరం విషయంలో టీడీపీ నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకుని చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నసీర్‌ అహ్మద్‌ తన ఎన్నికల ప్రచార పత్రంలో పేర్కొన్న ఆలయ అభివృద్ధి, సంరక్షణ హామీ

‘మేం చెప్పినట్లు వినాల్సిందే.. కోర్టులో ఉంటే ఏమవుతుంది.. మా కమిటీ వేసి తీరుతాం. ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం..’ గుంటూరు నగరంలో ఉన్న శ్రీ గీతామందిరం విషయంలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇదీ. దేవుడు అంటే భక్తి లేదు... కోర్టులు అంటే భయమూ లేదు. అఽధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ స్థానిక ఎమ్మెల్యే వద్ద ఉంటున్న కొంతమంది వ్యక్తులు గీతామందిరం సంబంధిత ఆస్తులు దోచుకునేందుకే ఇలా బరి తెగిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గుంటూరు1
1/10

గుంటూరు

గుంటూరు2
2/10

గుంటూరు

గుంటూరు3
3/10

గుంటూరు

గుంటూరు4
4/10

గుంటూరు

గుంటూరు5
5/10

గుంటూరు

గుంటూరు6
6/10

గుంటూరు

గుంటూరు7
7/10

గుంటూరు

గుంటూరు8
8/10

గుంటూరు

గుంటూరు9
9/10

గుంటూరు

గుంటూరు10
10/10

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement