మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించండి
గుంటూరు వెస్ట్: మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా జిల్లా పారిశుద్ధ్య కమిటీ రూపొందించిన పోస్టర్‌ను గురువారం కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన జరగరాదని చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కె.కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ శుక్రవారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మరుగుదొడ్ల మరమ్మతులు, ఇతర నిర్వహణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 6 నుంచి 9 వరకు మరుగుదొడ్ల సుందరీకరణ ఆవశ్యకత సర్వే చేస్తామన్నారు. అదే నెల 10న ముగింపు మరియు మరుగుదొడ్ల చక్కటి నిర్వహణ, సుందరీకరణకు అవార్డుల బహూకరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


