ఇంకుడు గుంతల ఆవశ్యకతను తెలియజేయండి
చేబ్రోలు: ఇంకుడు గుంతల ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ వివరించి చైతన్య పరచాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతిబసు అన్నారు. చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించి చెత్త సంపద తయారీ కోసం సిబ్బంది సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. ఎంపీడీఓ టి.ఊహారాణి, డిప్యూటీ ఎంపీడీఓ రవిశంకర్, సర్పంచ్ సాంబశివరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


