ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై దాడి

Nov 21 2025 7:25 AM | Updated on Nov 21 2025 7:25 AM

ఆన్‌ల

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై దాడి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై దాడి

పోలీసుల అదుపులో ఒకరు, పరారీలో ముగ్గురు

ల్యాప్‌టాప్‌లు, ఏటీఎం కార్డులు, బ్యాంక్‌ పాసు పుస్తకాలు, ఫోన్లు స్వాధీనం

మంగళగిరి టౌన్‌ : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం రావడంతో మంగళగిరి రూరల్‌ పోలీసులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి మండలం చినకాకాని గ్రామం ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్‌.వి.ఎన్‌. రెసిడెన్సీలోని ఓ ఫ్లాట్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ జరుగుతోందంటూ మంగళగిరి రూరల్‌ పోలీసులకు సమాచారం అందింది. నార్త్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ బ్రహ్మం ఆదేశాల మేరకు ఎస్‌ఐ వెంకట్‌ తన సిబ్బందితో ఈనెల 16వ తేదీ రాత్రి దాడి చేశారు. ఏసన్న అనే యువకుడిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారైనట్లు సమాచారం. ఐదు ల్యాప్‌టాప్‌లు, 32 సెల్‌ఫోన్లు, 23 ఏటీఎం కార్డులు, 22 బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు, 11 చెక్‌బుక్‌లతో పాటు పలు ఎలక్ట్రానిక్‌ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఐదు నెలల క్రితం ఈ అపార్ట్‌మెంట్‌లో నలుగురు యువకులు ఫ్లాట్‌ తీసుకుని ఉంటున్నారు. మచిలీపట్నం పోర్టు రోడ్డుకు చెందిన కొక్కిలిగడ్డ ఏసన్న, తణుకుకు చెందిన బాలు, మరో ఇద్దరు ప్రవీణ్‌, సూర్యలు కలసి నిషేధిత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ జనాల వద్ద నుంచి అందినంత దోచుకుంటున్నారు. హుబ్లీబుక్‌.కామ్‌ పేరుతో యూజర్‌ ఐడీలు క్రియేట్‌ చేసి యూజర్‌లకు డబ్బు ఆశ చూపి ఈ దందా కొనసాగిస్తున్నారు. వాట్సప్‌ ద్వారా కస్టమర్లకు కాంటాక్ట్‌ అయి ఫోన్‌ నెంబర్‌ ఇస్తే యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసి ఇస్తారు. వీటి ద్వారా లాగిన్‌అయ్యి వాటిలో ఉన్న కొన్నిరకాల గేమ్స్‌ ఆడుకోవడం ద్వారా నగదు రావడం, పోవడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా తణుకు చెందిన బాలు కొన్ని ఫేక్‌ బ్యాంక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేశాడు. కొంతమంది వ్యక్తుల నుంచి వారికి కొంత మొత్తం డబ్బులు చెల్లించి వారి ఆధార్‌ కార్డులు సేకరించి రకరకాల బ్యాంకుల్లో పథకం ప్రకారం ముందుగా తీసుకున్న సిమ్‌ నెంబర్లు ఇచ్చి బ్యాంక్‌ అకౌంట్‌లు ఓపెన్‌చేశాడు. ఈ ఖాతాలను వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి రిజిస్ట్రేషన్‌ ఫీ దగ్గర నుంచి మొత్తం నగదు లావాదేవీలను ఆ ఫేక్‌ అకౌంట్‌ ద్వారా నిర్వహిస్తుంటాడు. ముందుగా కస్టమర్స్‌కు కొంత లాభం వచ్చేలా చేసి తరువాత ఎక్కువ డబ్బులు బెట్టింగ్‌ పెట్టినప్పుడు వారిని మోసం చేస్తూ ఉంటారు. గేమ్‌ ఆడిన తరువాత డబ్బులు కస్టమర్‌కు వస్తే వాటిని విత్‌డ్రా చేయడం వంటి పనిని మిగిలిన ముగ్గురూ చూసుకుంటారు. బాలూ లేని సమయంలో మచిలీపట్నంకు చెందిన మరో యువకుడు మనోహర్‌ మంగళగిరి పట్టణంలో ఉంటూ ఈ వ్యవహారాన్ని నడుపుతూ ఉంటాడు. వాళ్లు బయటకు రాకుండా వారి అవసరాలన్నీ అతనే చూస్తుంటాడు. బాలు దగ్గర ఉన్న 31 బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఈ వ్యవహారం అంతా బాలు, మనోహర్‌లే చూసుకుంటారు. ఈ ఘటనపై గేమింగ్‌ యాక్ట్‌ కింద వీరిపై మంగళగిరి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కెనరా బ్యాంక్‌ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో బ్యాంకు వ్యవస్థాపకులు అమ్మెంబాల్‌ సుబ్బారావు జయంతి, బ్యాంకు 120వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రాంతీయ అధికారి డి.రాజ్‌కుమార్‌, కార్యాలయ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

– కొరిటెపాడు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై దాడి 
1
1/1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement