క్షణంలో జీవ‘కళ’ ఉట్టిపడేలా..!
తెనాలి: వివాహ వేడుకల చిత్రీకరణలో దక్షిణ భారతదేశంలోనే మంచి బ్రాండ్లలో ఒకటిగా ఫణి గోగిరెడ్డికి చెందిన ‘24 ఫ్రేమ్స్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ’ గుర్తింపు పొందింది. డెస్టినేషన్ వివాహాల చిత్రీకరణలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నారు. పెళ్లి వేడుకల్లో ఆయన తీసే ఫొటోలు ఆ వేడుకకే వన్నె తెస్తాయి. అద్భుత అనుభూతుల కథను చక్కగా చెబుతాయి. ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న ఆయన తాజాగా టైమ్స్ బిజినెస్ అవార్డు–2025ను స్వీకరించారు.
చిన్న వయస్సులోనే గుర్తింపు పొందిన ఫణి గోగిరెడ్డి స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చుండూరు మండలంలో ఉన్న మోదుకూరు గ్రామం. పాఠశాలకు వెళ్లేటప్పుడే ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉండేది. కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా తర్వాత ఫొటోగ్రఫీ కోర్సు చేశారు. సినిమా రంగం వైపు వెళ్లి అసిస్టెంట్ కెమెరామెన్‌గా వృత్తి జీవితం ఆరంభించారు. సినిమాటోగ్రాఫర్‌గా ‘ఎవడు’, ‘మిస్టర్ నూకయ్య’, ‘‘దూసుకెళతా’, దేనికై నా రెడీ’ తదితర పది సినిమాలకు పనిచేశారు. ఆ సమయంలో మూడున్నరేళ్లపాటు ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మోహన్‌బాబు కంపెనీలో కొనసాగారు.
సొంత కంపెనీతో మరో ప్రస్థానం ఆరంభించారు. ఆయన స్థాపించిన 24 ఫ్రేమ్స్ అంటే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ప్రసిద్ధ ఫొటోగ్రఫీ సంస్థగా పేరొచ్చింది. ఫణి గోగిరెడ్డి సీఈవోగా 2016లో ఇది ప్రారంభమైంది. వంద మందికిపైగా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లు, క్రియేటివ్ లీడ్స్, హెచ్‌ఆర్ ప్రొఫెషనల్స్ బృందంతో వినియోగదారుల మన్ననలు పొందిందీ సంస్థ. వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, డెస్టినేషన్ షూట్స్‌లో ప్రత్యేకత చాటుతోంది. ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల వారికోసం అమెరికాలోనూ బ్రాంచి నెలకొల్పారు. జూబ్లీహిల్స్‌లో ఆరు వేల అడుగుల కార్పొరేట్ ఆఫీస్‌ను ఈ మధ్యే ఆరంభించారు. ఇటీవల ఆయన స్థాపించిన ‘అలంకార’ ఈవెంట్ డెకార్ కంపెనీని యాంకర్ శ్యామల, ఈవెంట్స్‌ను మంచు మనోజ్ ప్రారంభించారు.
మరోసారి ప్రత్యేక గుర్తింపు
ఇప్పటికే పారామౌంట్ కాన్సెప్ట్ ఇన్ ఫొటోగ్రఫీ, కస్టమర్ సపోర్ట్ అవార్డులను గెలుచుకున్నారు. ఇన్నోవెక్సియా ఇంటర్నేషనల్ ఏటా ప్రదానం చేసే జాతీయ స్థాయి ‘ఇండియన్ ఎమినెంట్ అవార్డు–2023’ను కూడా 24 ఫ్రేమ్స్ సంస్థ అందుకుంది. గత నెల 30న హైదరాబాద్‌లో జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డుల్లో ‘టైమ్స్ బిజినెస్ అవార్డు’ను బాటీవుడ్ నటి దియా మీర్జా చేతులమీదుగా ఫణి గోగిరెడ్డి స్వీకరించారు. పలువురు వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ఈ గౌరవం దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని ‘సాక్షి’తో ఫణి గోగిరెడ్డి పేర్కొన్నారు. నికాన్ ఇండియాకు అంబాసిడర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.
చిన్ననాటి నుంచే ఆసక్తి
వినియోగదారులు మెచ్చేలా...
సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత... రెండూ అవసరమైన కళ ఫొటోగ్రఫీ. భావోద్వేగాలను క్షణంలో కెమెరా కన్నుతో ఒడిసిపట్టడం అంత సులువేం కాదు. అంతటి క్లిష్టమైన కళలో అసాధారణ ప్రతిభ చాటుతున్నారు ఫణి గోగిరెడ్డి. తాజాగా జాతీయ స్థాయిలో మరో అవార్డును కై వసం చేసుకున్నారు.
మోదుకూరు వాసికి
మరో జాతీయ స్థాయి అవార్డు
‘24 ఫ్రేమ్స్ ఫొటోగ్రఫీ’తో
దక్షిణాదిలో ఇప్పటికే గుర్తింపు
19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే
సందర్భంగా ప్రత్యేక కథనం
1/1
క్షణంలో జీవ‘కళ’ ఉట్టిపడేలా..!