న్యూస్‌రీల్
రాజధాని రాకముందే నయం
మహాలక్షమ్మచెట్టు వార్షికోత్సవం
ఘనంగా అమ్మవారికి బోనాలు
వైభవంగా గంగానమ్మ జాతర
సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఇంజినీరింగ్‌కు ఫుల్ డిమాండ్
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
● ఉమ్మడి గుంటూరు జిల్లాలోని
ఇంజినీరింగ్ సీట్లు దాదాపు భర్తీ
● 36 కాలేజీల్లో తొలి విడత
కౌన్సెలింగ్‌లోనే 90 శాతానికిపైగా భర్తీ
● ప్రస్తుతం చివరి విడతలో
మిగతా సీట్ల భర్తీకి సన్నాహాలు
ఇంజినీరింగ్ ప్రవేశాల తొలి విడత ప్రక్రియ ముగిసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష అయిన ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించిన ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా మొదటి విడతలో ఇప్పటికే సీట్ల కేటాయింపు పూర్తయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 90 శాతానికిపైగా సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లను రెండో విడతలో భర్తీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాడికొండ: కొండవీటి వాగు ముంపునకు కారణం చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆదివారం తుళ్లూరు మండలం పెదపరిమి– నీరుకొండ గ్రామాల మధ్య కొండవీటి వాగు ముంపునకు గురైన పంట పొలాలను నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)తో కలిసి అంబటి పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో చర్చించారు. మీడియాతో అంబటి మాట్లాడుతూ భారీ వర్షాలు తగ్గి ఐదు రోజులైనా పంట పొలాల్లోని నీరు బయటకు పోకపోవడం దురదృష్టకరమన్నారు. వాగు ముంపు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారని, ముంపు నివారణకు ప్రభుత్వం ఎత్తిపోతల పథకం చేపట్టకముందే తమ పరిస్థితి బాగుందని పేర్కొంటున్నట్లు గుర్తుచేశారు. వాగును ఎగువ నుంచి ఆధునికీకరణ చేయకుండా, రాజధాని పేరుతో దిగువ ప్రాంతంలో రోడ్లు, భవనాలు కట్టడం వలన వాగు స్వరూపం పూర్తిగా కోల్పోయి ఈ దుస్థితి వచ్చిందని రైతులు చెబుతున్నట్లు తెలిపారు. ముంపు నివారణకు రూ.230 కోట్లతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం కింద 24 గంటలూ పనిచేసినా పంట పొలాల్లో నీరు తగ్గని పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం చంద్రబాబు ప్రభుత్వం తెలివి తక్కువ పనులే అన్నారు. ఎత్తిపోతల పథకం పెట్టి బిల్లు చేసుకున్నారని రైతులే చెబుతున్నారని, ఆ కారణంగా రాజధాని ప్రాంతంలో పొలాలు గతంలో ఎన్నడూ లేనంతగా ముంపునకు గురవుతున్నట్లు తెలిపారు. సమీకరణ చేసిన 53 వేల ఎకరాలు చాలక.. మరో 43 వేల ఎకరాలు తీసుకోవాలని దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. తీసుకున్న వాటికే గతి లేకపోతే మళ్లీ తీసుకోవడం రైతాంగానికి, ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్ర నష్టమని అన్నారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
7
పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ రాజధాని ప్రాంతం ఏర్పడక ముందు రైతుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని బాధితులు చెబుతున్నారని పేర్కొన్నారు. రాజధాని పేరుతో జరిగిన నిర్మాణాల కారణంగా వాగు ప్రవాహం కిందికి వెళ్లే పరిస్థితి లేక నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలు గాలికొదిలి రాజధాని పేరుతో చేసుకుంటున్న ప్రచారాలను ప్రభుత్వం ఇకనైనా పక్కన పెట్టాలన్నారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ తాడికొండ, తుళ్లూరు మండలాల అధ్యక్షులు ముప్పాళ్ల మనోహర్, నాగమల్లేశ్వరరావు, తాడికొండ, పెదపరిమి గ్రామాల అధ్యక్షులు వంగా పోలారెడ్డి, ఉమామహేశ్వరరావు, వివిధ విభాగాల నాయకులు చుండు వెంకటరెడ్డి, కొప్పుల శేషగిరిరావు, నాయుడు నాగేశ్వరరావు, నంబూరు రఘునాథరావు, నంబూరు బాబు, పుట్టి సుబ్బారావు, షేక్ అజీజ్, దమ్మాటి మోహనరావు, ధూళిపాళ్ల నాగేశ్వరరావు, పులి రమేష్, ఇసుకపల్లి రమేష్ అక్కల లక్ష్మీనారాయణరెడ్డి, మున్నంగి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వరస సెలవుల నేపథ్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం చల్లగా ఉండటం, చిరు జల్లులు కురుస్తుండటంతో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోనే సేద తీరారు. ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, శ్రావణ మాస ప్రత్యేక కుంకుమార్చనతో పాటు చండీహోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ, వీఐపీ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు.
నరసరావుపేట: స్థానిక కోటబజార్‌లో గల మహాలక్ష్మమ్మచెట్టు వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక మహిళలు జలబిందెలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పూజలు చేశారు. అన్నదానం జరిగింది.
శావల్యపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామంలో పోలేరమ్మకు ఆదివారం బోనాలు ఘనంగా సమర్పించారు. మహిళా భక్తులు బోనాలను ఊరేగింపుగా తెచ్చారు.
తాడేపల్లి రూరల్: మంగళగిరి మండలం ఆత్మకూరులో గంగానమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మవారికి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు.
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు