
యూటీఎఫ్ కార్యాలయంలో సమైక్యత సదస్సు
లక్ష్మీపురం: దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడారని ప్రముఖ చరిత్రకారులు, కళా రత్న అవార్డు గ్రహీత నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేట యూటీఎఫ్ హాల్‌లో ఆదివారం ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమం నాటి త్యాగాలు.. నేటి కర్తవ్యాలు అనే అంశంపై సమైక్యతా సదస్సు జిల్లా అధ్యక్షుడు మహబూబ్ సుభాని అధ్యక్షతన జరిగింది. స్వాతంత్య్ర ఉద్యమంలో సమైక్య పోరాటాల గురించి మతసామరస్యం గురించి నసీర్ అహ్మద్ అనేక ఉదాహరణలను తెలియజేశారు. యూటీఎఫ్ నాయకురాలు ఎండీ షకిలా బేగం మా ట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో నేటి పరిస్థితుల గురించి వివరించారు. మిడిల్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వీవీకే సురేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అదేవిధంగా లౌకిక తత్వాన్ని కాపాడుకోవడంకోసం సమైక్యంగా ఉద్యమించడమే మన ముందున్న కర్తవ్యమన్నారు. కార్యక్రమానికి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిష్టి, సలీం, ప్రొఫెసర్ వేణుగోపాల్, విరసం నాయకులు రవిచంద్ర, నజీర్ మహెక్, సైదా, ఐద్వా నాయకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.