'క‌రువు - చంద్ర‌బాబు' ఇద్ద‌రూ.. క‌వ‌ల‌లు : మోపిదేవి | - | Sakshi
Sakshi News home page

'క‌రువు - చంద్ర‌బాబు' ఇద్ద‌రూ.. క‌వ‌ల‌లు : మోపిదేవి

Dec 10 2023 2:10 AM | Updated on Dec 14 2023 11:35 AM

- - Sakshi

గుంటూరు: రైతు పక్షపాతి, రైతు బాంధవుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. రేపల్లె పట్టణంలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మిచాంగ్‌ తుఫాన్‌తో పంట దెబ్బతినటంతో రైతులు నష్టపోయారని, రైతాంగాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదుకుంటారని అన్నారు.

వాతావరణ శాఖ తుఫాన్‌ హెచ్చరికలతో ముందస్తు ఆయా ప్రాంతాలకు అత్యవసర నిధులు మంజూరు చేసి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా సీఎం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పంట బాగా దెబ్బతిన్న ప్రాంతాలలో సీఎం జగనన్న పర్యటించి పంటను పరిశీలించి రైతులకు నష్టపరిహారాన్ని సంక్రాంతి పండగ నాటికి అందజేస్తానని భరోసా ఇచ్చారని చెప్పారు.

కరువు, చంద్రబాబు కవలలు..
కరువు, చంద్రబాబు నాయుడు కవల పిల్లలు వంటి వారన్న నానుడి ప్రజల్లో ఉందని ఎంపీ చెప్పారు. చంద్రబాబు పాలనా కాలంలో చుక్కనీరు అందక పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. 14 సంవత్సరాల పాలనా కాలంలో చంద్రబాబు రైతుల కోసం సానుకూలంగా ఆలోచించిన దాఖలాలు లేవన్నారు.

నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, నేడు రైతుల కోసం మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే మాట్లాడుతున్నారని, పదవి కోసం పగటి కలలు కంటున్నారన్నారు. సమావేశంలో వైస్‌చైర్మన్‌ తూనుగుంట్ల కాశీవిశ్వనాథగుప్త, మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కొమ్మూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాల్గొన్నారు.
ఇవి చ‌ద‌వండి: టీడీపీలో ట్విస్ట్‌.. లోకేష్‌కు ఊహించని ఎదురుదెబ్బ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement