Deepak Chauhan: నవ్విస్తే ఏమొస్తుంది.. బోలెడు డబ్బులు వస్తాయి గురూ.. నమ్మరా!

Youtuber Laughing King Deepak Chauhan Successful Journey In Telugu - Sakshi

లాఫింగ్‌ కింగ్‌

Youtuber Laughing King Deepak Chauhan Successful Journey In Telugu: కాస్త సరదాగా మొదలెడదాం... నవ్వితే ఏమొస్తుంది? నవ్వే వస్తుంది. నవ్విస్తే ఏమొస్తుంది? బోలెడు లైక్‌లు వస్తాయి. సొంతకాళ్ల మీద నిలబడేంత డబ్బులు వస్తాయి! యూట్యూబ్‌ చానల్‌ ‘స్టార్‌’ చేయడం చాలా వీజి. దాన్ని ‘స్టార్‌’ చేయడం వెరీ కష్టమ్‌ అంటారు యూట్యూబ్‌ తత్వవేత్తలు. దీపక్‌ చౌహాన్‌ చానల్‌  మొదలుపెడితే ‘స్టార్‌’ కావడం తప్ప స్టార్టింగ్‌ ట్రబుల్స్,ఆ తరువాత ట్రుబుల్స్‌ అంటూ ఏమీ ఉండవు.
దీపక్‌ విజయమంత్రం... హాస్యం!

నోయిడా (ఉత్తర్‌ప్రదేశ్‌)కు చెందిన దీపక్‌ బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుకునే రోజుల్లో నటనపై మనసు మళ్లింది. కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అందరిలాగే తనను యూట్యూబ్‌ ఆకర్షించింది. దీపక్‌కు వ్గోగ్స్‌(వీడియో బ్లాగింగ్‌) అంటే ఇష్టం. ఇద్దరు ఫ్రెండ్స్‌(శుభమ్‌గాంధీ, పియూష్‌ గుర్జర్‌)తో కలిసి ‘దీపక్‌ శుభమ్‌ పియూష్‌ వ్లోగ్స్‌’ వ్గోగ్‌ మొదలుపెట్టాడు. 3.5 లక్షల సబ్‌స్క్రైబర్స్‌తో అది దూసుకెళ్లింది.

ఆ తరువాత సొంతంగా ‘దీపక్‌ చౌహాన్‌’ యూట్యూబ్‌ చానల్‌ మొదలు పెట్టాడు. 60కె సబ్‌స్రైబర్స్‌తో శబ్భాష్‌ అనిపించుకుంది. తన ఫ్రెండ్స్‌ శుభమ్‌ గాంధీ, పియూష్‌లతో కలిసి మొదలు పెట్టిన ‘రియల్‌హిట్‌’ 3.25 మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌తో మోస్ట్‌ పాప్‌లర్‌ అండ్‌ ట్రెండింగ్‌ యూట్యూబ్‌ చానల్‌లలో ఒకటిగా నిలిచింది. దీపక్‌ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారే. తాను మాత్రం ఈ ఫీల్డ్‌ ఎంచుకున్నాడు. ప్రస్తుతం తన చానల్‌లో వెబ్‌సిరీస్‌ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు దీపక్‌.

చానల్‌ సక్సెస్‌ కాగానే ‘ఇక వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేదు’ అనే ఆత్మవిశ్వాసంతో ఉండేవాళ్లు అక్కడే ఉండిపోతారు. కానీ దీపక్‌కు మాత్రం ఏ రోజుకు ఆరోజు కొత్త. ప్రతిరోజూ ఒక పరీక్ష. సృజనాత్మక శక్తులు మనలో బలపడాలంటే ఏసీ రూమ్‌లో కూర్చుంటే సరిపోదు.

నిరంతరం ప్రజాసమూహాల మధ్య ఉండాలనే ఎరుక దీపక్‌కు ఉంది. అందుకే పెళ్లి ఫంక్షన్‌ల నుంచి పుట్టిన రోజు ఫంక్షన్‌ల వరకు తప్పకుండా హాజరవుతాడు. అక్కడికి వచ్చిన వారి హావభావాలు, హాస్యచెణుకులు, కొత్త పదాలు...అన్ని సీరియస్‌గా గమనిస్తాడు. ఇక్కడి నుంచే తనకు అవసరమైన ముడిసరుకు దొరుకుతుంది. వాటికి తన కల్పన జోడించి షార్ప్‌గా ‘షార్ట్స్‌’ తయారుచేసి వదులుతాడు.

ఒకరోజు ఒక పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లాడు దీపక్‌. ఒక పెద్దావిడ తనను వెదుక్కుంటూ వచ్చింది. ‘మా ఆయనను పూర్తిగా మార్చేశావయ్యా’ అంది చాలా గంభీరంగా. ‘నేను మార్చడమేమిటి!’ అనుకున్నాడు దీపక్‌. ఆమె ఇలా చెప్పింది... ‘మా ఆయన నవ్వడం పెళ్లయిన కొత్తలో చూశాను. ఇక అంతే...ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవాడు. అందరిలా నవ్వితే తన పెద్దరికం ఎక్కడ పలచబారుతుందో అన్నట్లుగా ఉండేవాడు. అలాంటి మా ఆయన నీ వీడియోలు చూసి చిన్నపిల్లాడిలా నవ్వుతూనే ఉన్నాడు....’ చెప్పుకుంటూపోతూనే ఉంది ఆమె. ఇంతకీ దీపక్‌ ఎక్కడ? క్లౌడ్‌9పై అని వేరే చెప్పాలా! 

చదవండి:

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top