
కడుపు ఉబ్బరం చాలా మందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. క్రమంగా జీర్ణ సమస్యలు, మానసిక రుగ్మతలు, నిద్ర లేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. సహజంగానే ఈ సమస్యను నివారించు కోవచ్చు.
ఎందుకు వస్తుంది?
కడుపులో ఏర్పడే కొన్నిరకాల రసాయనాల ద్వారా ఇలా జరుగుతుంది. సాధారణంగా కడుపు ఉబ్బరం అనేది మలబద్ధకం ద్వారా వస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా కడుపు ఉబ్బరాన్ని కొన్ని యోగాసనాల ద్వారా తగ్గించుకోవచ్చు
కటి చక్రాసనం...
పేరుకు తగ్గట్లుగానే ఈ ఆసనం వెన్నెముకకు సంబంధించినది. నేలపై నిల్చొని వీపును రెండు పక్కలా తిప్పుతూ ఉండాలి.
ఈ సమయంలో చేతులను భుజాలకు రెండు వైపులా స్ట్రెచ్ చేస్తూ చా΄ాలి. ఇలా రెండువైపులా కనీసం 10 రౌండ్లు, 2 నిమిషాల వరకు చేయాలి.
చదవండి: లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’
సైడ్ యాంగిల్ పోజు: కాళ్లను స్ట్రెచ్ చేసి, ఒకవైపుగా వంగాలి. ఇంకో కాలును వెనక్కి చాపాలి. వంగిన కాలుమీద చేతిని ఉంచి మరో చేతిని నిటారుగా పైకి చూపిస్తూ, బాడీని వీలైనంత వరకు వంచాలి. మొదట్లో 15–20 సెకన్ల నుంచి ప్రారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయడం అలవాటు చేసుకోవాలి.
ఇదీ చదవండి: వీటికి చాలా దూరంగా ఉండాలి...ఫుడ్ @ 60

ఫ్రాగ్ పోజ్: ముందుగా వజ్రాసన భంగిమలో మీ కాళ్లను వెనుకకు మడిచి యోగా మ్యాట్‌పై కూర్చోవాలి. మీ చేతులను పిడికిలిగా చేసి, వాటిని ఉదరం దగ్గర పెట్టుకుని మెల్లగా ముందుకు వంగాలి. ఈ ఆసనం కూడా మొదట్లో 15–20 సెకన్ల నుంచి ్ర΄ారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయాలి.