పాలకూర, పప్పు దినుసులు, బాదం..తింటే స్త్రీలలో ఆ సమస్యలు..

World Food Day These Healthy Foods Helps To Keep Women Healthy And Strong - Sakshi

మన దేశంలో అనేకమంది స్త్రీలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారనే విషయం అందరికీ విధితమే. దీనితో తాము అనారోగ్యంగా ఉండటమేకాకుండా, పోషకాహార లోపం ఉన్న రేపటి తరానికి జన్మనిస్తున్నారు. అందువల్ల మహిళలకు వారి పోషకాలలో వాటా అందేలా చూడడం అత్యవసరం. మన దేశంలో కేవలం ఆకలిని మాత్రమే నిర్మూలిస్తే సరిపోదు, బదులుగా, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం ప్రజలందరికీ అందుబాటులో ఉంచడమూ అవసరమేనని పోషకాహారనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకుందాం..

పాలకూర 
పాలకూరలో పోషకాలను తక్కువగా అంచనా వేయకండి. ఇది రోగనిరోధక శక్తి పెరుగుదలకు, ఎముకల పుష్టికి సహాయపడుతుంది. పాలకూరను మహిళల సూపర్‌ఫుడ్‌ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో మాగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మహిళల గర్భధారణ సంమయంలో అవసరమైనంతమేరకు శరీరానికి ఖనిజాలను అందిస్తుంది.

చదవండి: పెట్రోల్‌ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!!

పప్పు దినుసులు
పప్పు దినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలకు అవసరమైన ప్రొటీన్లు అందించడంలో వీటి పాత్ర కీలకం. ప్రతి రకం పప్పుల్లో దానిదైన ప్రత్యేక పోషక ప్రయోజనాలను అందిస్తుంది.

ఓట్స్‌
రోజువారీ శక్తికి అవసరమైన ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ను అందించడంలో ఓట్స్ కీలకం. వీటిల్లో ఇతర ధాన్యాల కంటే ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికమే. 

పాలు
వర్కింగ్‌ ఉమెన్‌కు ఎముకల్లో పటుత్వం తగ్గి, ఎముకల నిర్మాణంలో మార్పులు సంభవించే ప్రమాధం ఉంది. ఇది ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐతే పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గ్లాస్‌ పాలు తాగితే రోజువారీ అవసరమైన కాల్షియంను తగుమోతాదులో అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, భాస్వరం, పొటాషియం, డి, బి విటమిన్లు కూడా ఉన్నాయి.

బ్రోకోలీ
మహిళలకు మేలుచేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బ్రోకోలీ అత్యంత కీలకమైనది. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ఎంతో సహాయపడుతుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ నివారణలో దీని పాత్ర కీలకం. గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకల పటుత్వానికి దోహదపడుతుంది.

బాదం
జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉత్పత్తికి బాదం ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పావు కప్పు బాదంలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దీనిలో మెగ్నీషియం కూడా అధికంగానే ఉంటుంది.

నిపుణులు సూచిస్తున్న ఈ ఆహారాలను తీసుకుంటే మహిళల్లో పోషకాహారలోపాన్ని అరికట్టవచ్చు.

చదవండి: ఈ వాటర్‌ బాటిల్‌ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు..

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top