World Biryani Day: ఈ బిర్యానీ డే మీకో ఛాలెంజ్! | World Biryani Day 2025: Interesting 10 Facts About Biryani Varieties | Sakshi
Sakshi News home page

World Biryani Day: ఈ బిర్యానీ డే మీకో ఛాలెంజ్!

Jul 5 2025 7:24 PM | Updated on Jul 5 2025 7:36 PM

World Biryani Day 2025: Interesting 10 Facts About Biryani Varieties

రుచికి రాజు, రాజులకు రుచికరమైన వంటకం బిర్యానీ!. ఇది కేవలం వంటకం కాదు.. ఓ భావోద్వేగం, ఓ సంస్కృతి, ఓ రుచుల పండుగ! బిర్యానీని తినని వాడు ఉండొచ్చు. కానీ బిర్యానీ గురించి వినని వాడు ఉండడు!. ఈ జులై 6న(జులై తొలిఆదివారం) వరల్డ్‌ బిర్యానీ డే. బిర్యానీ ప్రేమికులు తమ అభిమాన వంటకాన్ని ఘనంగా ఆస్వాదించాల్సిన రోజు కూడా!..

హైదరాబాద్ గల్లీ నుంచి హార్వర్డ్‌ యూనివర్సిటీ క్యాంటీన్ వరకూ.. బిర్యానీ చేసిన గ్లోబల్‌ ప్రయాణం నిజంగా ఓ అద్భుతం. 2022లో దావత్ బాస్మతి రైస్ సంస్థ ప్రారంభించిన ప్రపంచ బిర్యానీ దినోత్సవం(World Biryani Day 2025) ఇప్పుడు మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ప్రతి సంవత్సరం జులై నెలలోని మొదటి ఆదివారం ఈ వేడుక జరుపుతూ వస్తున్నారు. ఇటు.. సోషల్ మీడియా, అటు.. ఫుడ్ ఫెస్టివల్స్, ఇంకోవైపు రెస్టారెంట్ ఆఫర్లతో బిర్యానీ డే ఓ ఫుడ్ కల్చరల్ సెలబ్రేషన్‌గా మారింది.

హైదరాబాద్ బిర్యానీకి రాజధాని
నిజాం రాజుల కాలం నుంచి బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు రాజభవనాల్లో వండిన ఈ వంటకం, ఇప్పుడు ప్రతి వీధిలో అందుబాటులో ఉంది. సుమారు 50కి పైగా రకాల బిర్యానీలు నిజాం ఆస్థానంలో తయారయ్యేవని చరిత్ర చెబుతోంది. అందులో చేపల బిర్యానీ నుంచి ఊరేడు పిట్ట బిర్యానీ వరకు ఉన్నాయట!

బిర్యానీ.. ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్
బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని "బిర్యాన్" నుంచి వచ్చింది. దీని అర్థం “ఫ్రై చేయడం” లేదా “వేపడం”. అంటే బిర్యానీకి మూలాలు పశ్చిమాసియాలో ఉన్నా, దానికి అసలైన రుచి మాత్రం భారతదేశమే ఇచ్చింది!

ఈ బిర్యానీ డే మీకో ఛాలెంజ్!
బిర్యానీ అంటే మీకు ఏ రకం ఇష్టం? హైదరాబాదీ బిర్యానీనా?, లేక మలబార్ బిర్యానీనా?, లక్నోబిర్యానీనా?, లేదంటే కోల్‌కతా బిర్యానీనా?. ఏది అందుబాటులో ఉంటే అదే అంటారా? అయితే సరి!. ఈసారి బిర్యానీ తినడమే కాదు... మీరు ఎప్పుడూ ట్రై చేయని ఓ కొత్త రకమైన బిర్యానీ వండండి. దాని ఫోటో తీసి #WorldBiryaniDay హ్యాష్‌ట్యాగ్‌తో 9182729310 నెంబర్‌కు వాట్సాప్‌ చేయండి. మీ బిర్యానీ స్టోరీని మాతో పంచుకోండి. అది మీరే వండింది కావొచ్చు.. మీ అమ్మ చేతి బిర్యానీ కావొచ్చు. దానిని ఓ మధురమైన జ్ఞాపకంగా మలిచే ప్రయత్నం మేం చేస్తాం. 



బిర్యానీ అంటేనే ఒక మాయ!. ఆ మాయకు ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలు ఉన్నాయి. వాటి సంఖ్యను ఖచ్చితంగా చెప్పడం కష్టం, కానీ 100కి పైగా రకాల బిర్యానీలు ఉన్నాయని ఒక అంచనా. వాటిలో కొన్ని ప్రాంతీయ ప్రత్యేకతలతో, కొన్ని దేశీయ వంటకాలతో కలిసినవిగా ఉంటాయి. ప్రతి రకానికి ప్రత్యేకమైన మసాలాలు, వండే పద్ధతి ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన బిర్యానీ రకాలలో కొన్ని:
 

  • భారతదేశం:  హైదరాబాదీ, లక్నో (అవధీ), కోల్‌కతా, మలబార్, అంబూర్, సింధీ, కశ్మీరీ, ఢిల్లీ స్టైల్, చెట్టినాడ్, ఇలా.. 

  • పాకిస్తాన్: కరాచీ బిర్యానీ, లాహోరి బిర్యానీ  

  • బంగ్లాదేశ్:  కాచ్చి బిర్యానీ, తేహారీ  

  • ఇరాన్:  బఘాలి పలో, జెరేష్‌క్ పలో (బిర్యానీకి మూలం ఇదేనని భావిస్తారు) 

  • ఇండోనేషియా: మలేషియా, నాసి బిర్యానీ  

  • మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో..  మాందీ, కబ్సా  (పొడిగా ఉండే బిర్యానీ, పొగ వాసనతో..)

ఒక్క భారతదేశంలోనే 30కి పైగా ప్రాంతీయ బిర్యానీలు ఉన్నాయి. వాటిలో వాడే మసాలాలు,  బియ్యం రకాలు (బాస్మతి, సీరా సాంబా, జిరా సామా), వంట పద్ధతులు (దమ్, కచ్చి, పక్కి), ఆయా శైలుల ప్రభావం (ముగలాయ్, నవాబీ శైలి).. ఇలా ఆధారపడి ఉంటాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement