గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్‌ చెబితే ‘ఏప్రిల్‌ పూల్‌’ అనుకుంది..చివరికి! | Woman goes to doctor for sore throat and shocks that she pregnant with quadruplets | Sakshi
Sakshi News home page

గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్‌ చెబితే ‘ఏప్రిల్‌ పూల్‌’ అనుకుంది..చివరికి!

Nov 18 2024 12:15 PM | Updated on Nov 18 2024 1:26 PM

Woman goes to doctor for sore throat and shocks that she pregnant with quadruplets

అనుకోకుండా, ఊహించని పరిణామాలు అద్భుతాలుగా నిలుస్తాయి. ఈ అద్భుతాల్లో మహాఅద్భుతాలు   మరికొన్ని  ఉంటాయి.  అలాంటి అద్భుతం కమ్‌..షాకింగ్‌ లాంటి ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆలస్యం చేయకుండా వివరాలను తెలుసుకుందాం పదండి!

అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన 20 ఏళ్ల నర్సింగ్ అసిస్టెంట్ కాట్లిన్ యేట్స్(Katelyn Yates)కు కూడా నమ్మలేని అనుభవం ఎదురైంది.  గొంతు నొప్పిగా ఉండటంతో ఒకరోజు ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు  ఎక్స్‌రే తీయించుకోమని సలహా ఇచ్చారు. అయితే ఎక్స్‌రేకి వెళ్లి ముందు ఒకసారి  ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేయించుకోవాలని కూడా సూచించారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఎక్స్‌రేలు  ప్రమాదకరం. రేడియేషన్ పిండానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున ముందుగానే గర్భంతో లేమనే నిర్ధారణ అవసరం. ఇక్కడే కాట్లిన్‌సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యే విషయం తెలుసుకుంది.  

అదీ కూడా  నమ్మశక్యంగాని విధంగా కాట్లిన్‌ గర్భవతి అని తేలింది. ఇందులో ఆశ్చర్యం ఏముందు అనుకుంటున్నారా?  ఆమె గర్బంలో పెరుగుతోంది ఏకంగా నలుగురు.  ముందు షాకైనా,  ఏప్రిల్ ఫూల్స్ డే కదా.. డాక్టర్‌  జోక్‌ చేస్తున్నారులే అని లైట్‌ తీసుకుంది కేట్లిన్. చివరికి విషయం తెలిసి మురిసి పోయింది.

కానీ పిల్లలకు జన్మనివ్వడానికి చాలా కష్టపడింది. అయితే ఆమె భర్త  జూలియన్ బ్యూకర్‌ కేట్లిన్‌కు  పూర్తిగా సపోర్ట్‌ అందించాడు. ధైర్యం చెప్పాడు. ఎందుకంటే కాట్లిన్‌కు ప్రీక్లంప్సియా అనే అరుదైన వ్యాధి వచ్చింది. ఇది ప్రమాదకరమైన అధిక రక్తపోటుకు కారణమయ్యే తీవ్రమైన పరిస్థితి. ఫలితంగాఆమెకు రక్తపోటు పెరిగి, కాలేయం, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. ఒక దశలో ఆమె శ్వాస అందక​ ఇబ్బంది పడింది.   దీంతో కేవలం 28 వారాలు , 4 రోజులలో,  వైద్యులు సిజేరియన్ చేసి నాలుగురు పిల్లలకు ప్రసవం చేశారు. ఎలిజబెత్ టేలర్, జియా గ్రేస్ , ఐడెంటికల్‌ ట్విన్స్‌గా మాక్స్ ఆష్టన్ , ఇలియట్ రైకర్‌ జన్మించారు.  నెలలు నిండకుండానే పుట్టడంతో ఎలిజబెత్ కేవలం ఒక పౌండ్, రెండు ఔన్సులు,  మాక్స్ బరువు రెండు పౌండ్లు, ఆరు ఔన్సులు మాత్రమే ఉన్నారు. తరువాత నాలుగు నెలల్లో  బాగా పుంజుకుని బరువు పెరగడంతో కెట్లిన్‌, ఆమె భర్త  జూలియన్ బ్యూకర్‌ సంతోషంలో మునిగిపోయారు. ఒకేసారి నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదు అన్నారు ఆసుపత్రి గైనకాలజిస్ట్‌ మెఘనా లిమాయే.  
ఇదీ చదవండి : 50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్‌ వర్కౌట్‌



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement