మహిళల క్యాన్సర్లలో ముఖ్యమైనది.. సర్వైకల్‌ క్యాన్సర్‌ గురించి తెలుసుకోండి! | What Is Cervical Cancer, Know About Symptoms And Preventions | Sakshi
Sakshi News home page

Cervical Cancer: మహిళల క్యాన్సర్లలో ముఖ్యమైనది..  సర్వైకల్‌ క్యాన్సర్‌ అంటే?

Jan 30 2022 1:15 PM | Updated on Jan 30 2022 1:28 PM

What Is Cervical Cancer, Know About Symptoms And Preventions - Sakshi

మహిళల క్యాన్సర్లలో ముఖ్యమైనది సర్వైకల్‌ క్యాన్సర్‌. సర్విక్స్‌ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది. మహిళ జీవితంలోని అనేక దశల్లో ఇది ఎన్నెన్నో మార్పులకు లోనవుతుంటుంది. అందుకే అక్కడ వేగంగా జరిగే కణవిభజన వల్ల క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. సర్వైకల్‌ క్యాన్సర్లలో అడెనోకార్సినోమా, స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా అని రెండు ప్రధాన రకాలున్నాయి. ఈ రెండింటికి అవలంబించాల్సిన చికిత్స విధానాలు వేర్వేరు. సెర్విక్స్‌లో వచ్చే అడెనోకార్సినోమాలో పీరియడ్స్‌ మధ్యలో లేదా దాంపత్యంలో పాల్గొన్న వెంటనే రక్తస్రావం, దుర్వాసనతో కూడిన తెలుపు, నడుము కింది భాగంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి

‘అడెనోకార్సినోమా’ సర్విక్స్‌ క్యాన్సర్‌ విషయంలో... అది ఆపరేషన్‌ ద్వారా తొలగించగల దశలో ఉంటే, శస్త్రచికిత్స ద్వారా ఆ భాగాన్ని తొలగించడమే మంచి మార్గం. ఇది అరుదుగా వచ్చేదే అయినప్పటికీ చిన్న వయసులోనే వచ్చే క్యాన్సర్‌ ఇది. ఇందులో రెండో రకం ‘స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా’ తరహాకు చెందింది. ఇందులోనూ పీరియడ్స్‌ మధ్యకాలంలో లేదా దాంపత్యం తర్వాత రక్తస్రావంతో పాటు యోని నుంచి దుర్వాసనతో కూడిన నీళ్లలాంటి రక్తస్రావం అవుతుంటుంది. కాస్త ముదిరినప్పటికీ చికిత్సకు మంచి ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Health Tips: కోవిడ్‌ నుంచి త్వరగా కోలుకునేందుకు... బాదం, రాగి దోశ, బెల్లం, కిచిడి..

సర్వైకల్‌ క్యాన్సర్‌ ‘హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌’ కారణంగా వస్తుంది. దీనికి వ్యాక్సిన్‌ ఉంది. ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే సర్వైకల్‌ క్యాన్సర్‌ను నివారించవచ్చు. బాలికలు 12–20 ఏళ్ల మధ్యలో దాన్ని తీసుకోవడం మంచిది. అంటే వివాహానికి ముందుగా... మరీ ముఖ్యంగా చెప్పాలంటే దాంపత్యజీవితం మొదలుపెట్టక ముందు తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్‌ను నివారించవచ్చు. 
చదవండి: అకస్మాత్తుగా వాంతి ,ఫిట్స్‌ రావడం జరుగుతుందా.. ఆలస్యం చేయకండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement