బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి

Foods That Help You Lose Weight And Satisfy Your Stomach - Sakshi

కొందరు బరువు తగ్గడం కోసం కడుపు మాడ్చుతుంటారు. కానీ కడుపు నిండా తింటూనే బరువు తగ్గడం ఆరోగ్యకరమైన మార్గం.  ఇటువంటి ఆహారంలో ముఖ్యమైనది కోడి గుడ్డు. గుడ్డులో ‘ల్యూసిన్‌’ అనే ఒక రకమైన ‘ఎసెన్షియల్‌ అమైనో యాసిడ్‌’ ఉంటుంది. ఇది నేరుగా బరువు తగ్గించడానికి దోహదపడుతుంది.

ఇక ఉడికించిన కోడి గుడ్లు ఒకటి లేదా రెండు గుడ్లు తినగానే కడుపు ఉబ్బిపోయినట్లుగా అనిపిస్తుంది. అంటే త్వరగా పొట్ట నిండేందుకు కోడిగుడ్లు ఉపయోగపడి, తద్వారా తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన ఫీలింగ్‌ వస్తుంది. ఈ రెండు ప్రయోజనాలతో కోడిగుడ్డు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఇక ఆకుకూరలు, కాయగూరల్లో నీటి మోతాదులు, పీచు పాళ్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తిన్న వెంటనే కడుపు నిండిపోయిన తృప్తి కలుగుతుంది. తాజా కాయ/ఆకుకూరలు కూడా బరువు తగ్గడానికి ఉపయోగం.

ఒకవేళ మీరు మాంసాహారాన్ని ఇష్టపడేవారైతే వేటమాంసాని(రెడ్‌మీట్‌)కి బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటి వైట్‌మీట్‌ తినడం మేలు. అది కూడా పరిమితంగా, కేవలం రుచికోసం మాత్రమే.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top