 
													మెదడుకు పదును..!
బజారులో నడిచి వెళ్తున్నప్పుడు తెలిసిన వ్యక్తి ఎదురు పడితే వెంటనే పేరు గుర్తురాదు. పలకరింపుగా నవ్వి ఏదో ఒక రకంగా మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇలా తరచూ జరుగుతుంటే మెదడు బద్దకంగా ఉంటోందని, మతిమరుపు పెరుగుతోందని జాగ్రత్త పడాల్సిందే. వార్థక్య లక్షణాలను దూరంగా ఉంచడానికి దేహానికి వ్యాయామం చేసినట్లే మెదడు చురుగ్గా ఉండడానికి తగినంత వ్యాయామం కావాలి.
రోజూ కనీసం ఒక్క పజిల్‌నైనా పరిష్కరించడం జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి మంచి మార్గం. అలా మెదడును కూడా చురుగ్గా ఉంచినప్పుడే మతిమరుపు అనే వార్థక్య లక్షణం దూరమవుతుంది. రోజూ ఈప్రాక్టీస్ ఉంటే డెబ్బై ఏళ్లు నిండినా సరే జ్ఞాపకశక్తి తగ్గదు. మతిమరుపు దరిచేరదు. దరి చేర్చుకోకూడని మిత్రుడు మతిమరుపు, మెదడు వాడదాం... మెదడును ‘వాడి’గా ఉంచుకుందాం.
చక్కెర తగ్గిస్తే కలిగే ప్రయోజనాలివి..
- చక్కెర ఉన్న పానీయాలు, స్వీట్లు, ఇతర పదార్థాలను తినడం మానేస్తే శరీరంలోకి అధికంగా చేరే కేలరీల పరిమాణం తగ్గుతుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. 
- చక్కెరను దూరం పెట్టడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు సహా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది. 
- నోటి ఆరోగ్యం, దంత సంరక్షణ కోసం చక్కెరను దూరం పెట్టడం చాలా మంచిది. 
- చక్కెరతో కూడిన ఆహార పదార్థాలను దూరం పెడితే నోటి సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. 
- చక్కెర తినడం మానేయడం వల్ల టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం తగ్గుతుంది. చర్మం త్వరగా ముడతలు పడటం తగ్గి కాంతిమంతంగా మారుతుంది 
- జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. 
ఇవి చదవండి: 'నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా'..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
