మగువుల మనసు దోచే స్టోన్స్‌ జ్యువెలరీతో స్టార్‌లా మెరిసిపోతున్నారు!

Trendy Ways To Wear Diamond Or Gemstone With Western Outfits - Sakshi

ఆభరణాలలో రాళ్లు అనగానే మనకు వజ్ర వైఢూర్యాలు గుర్తుకు వస్తుంటాయి. సంప్రదాయ ఆభరణాలలో పొదిగిన రత్నాలు కళ్లముందు కనిపిస్తుంటాయి. కానీ, వేషధారణలో ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ని ఇష్టపడినట్టే ఆభరణాలనూ వెస్ట్రన్‌ లుక్‌ను తీసుకువస్తున్నారు డిజైనర్లు. ధరించిన వెస్ట్రన్‌ డ్రెస్‌కు మరిన్ని హంగులు తీసుకురావడానికి రంగు రంగుల రాళ్లతో ఫ్యాషన్‌ జ్యువెలరీ రూపుదిద్దుకుంటోంది. స్టోన్‌ జ్యువెలరీని ధరించినవారు వేడుకలో ఎక్కడ ఉన్నాస్టార్‌లలా మెరిసిసోతున్నారు. 

స్టోన్‌ స్టార్స్‌ అని కితాబులు అందుకుంటున్నారు. ఇటీవల అట్రాక్ట్‌ చేస్తున్న ఫ్యాషన్‌ జ్యువెలరీలో స్టోన్‌ ముందువరసలో ఉన్నాయి. వెడల్పాటి స్టోన్స్, బీడ్స్‌ కాంబినేషన్‌లో వస్తున్న జ్యువెలరీని నవతరం మరింతగా ఇష్టపడుతుంది. బ్రాస్‌ మెటల్‌తో...రాళ్లను పట్టి ఉంచాలంటే అందుకు తగిన గట్టి తీగల అల్లిక కూడా ఉండాలి. దానికి అనువైన లోహంగా ఇత్తడి డిజైనర్ల చేతిలో కొత్తగా మెరుస్తోంది.

దీనితో స్టోన్‌ జ్యువెలరీని ఇండోవెస్ట్రన్‌ దుస్తులకు తగ్గట్టు ధరించేలా విన్నూతమైన డిజైన్స్‌ని మన ముందు కనువిందు చేస్తున్నాయి.. వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి ఈ డిజైన్స్‌. రంగు రాళ్లు అచ్చమైన బంగారు ఆభరణాల్లో రత్నాలను పొదగడం చూస్తుంటాం. అయితే, ఇప్పుడు ఫ్యాషన్‌ జ్యువెల్రీలో రంగు రాళ్లను ఉపయోగించి డిజైన్స్రూపొందిస్తున్నారు. సిల్వర్, స్టీల్‌ మెటల్‌తోనూ రంగు రాళ్లు కనువిందు చేస్తున్నాయి. తక్కువ ధరలో అతివల చూపులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.

రాళ్లలోనూ రెప్లికా.. 
రాతి యుగంలో తమను తాము కాపాడుకోవడానికి రకరకాల లోహాలు, జంతువుల ఎముకలు,  రంగు రాళ్లను ఆభరణాలుగా వాడుతూ వచ్చేవారు. నాగరికత మారుతున్న కొద్దీ డిజైన్స్‌లో మార్పులు వచ్చాయి కానీ, రాతి రూపం అలాగే ఉంటోంది. పిన్స్, బ్రోచెస్, రింగ్స్, పెండెంట్స్, నెక్లెస్‌లు, పొడవైన హారాలు, రాళ్ల వరసలు .. వీటిలో పూసలు కూడా జత చేరి మరింత హంగులతో స్టోన్‌ జ్యువెలరీ ముస్తాబు అవుతోంది. ఖరీదు ఎక్కువైన రత్నాలనే కాదు వాటి రెప్లికాలుగా రంగు రాళ్లతోనూ సంప్రదాయ, ఇండోవెస్ట్రన్‌ డిజైన్లు సృష్టిస్తున్నారు డిజైనర్లు. ఇటీవల అట్రాక్ట్‌ చేస్తున్న ఫ్యాషన్‌ జ్యువెలరీలో స్టోన్‌ ముందువరసలో ఉన్నాయి. వెడల్పాటి స్టోన్స్, బీడ్స్‌ కాంబినేషన్‌లో వస్తున్న జ్యువెలరీని నవతరం మరింతగా ఇష్టపడుతుంది.  

(చదవండి: అందాల తార సోనాక్షి సిన్హా ధరించిన డ్రస్‌ ధర తెలిస్తే..షాకవ్వుతారు!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top