పర్ఫెక్ట్‌ సమ్మర్‌ డెస్టినేషన్‌..! | Travel Tips: Coorgs Beauty Revealed Why Coorg is Popular | Sakshi
Sakshi News home page

పర్ఫెక్ట్‌ సమ్మర్‌ డెస్టినేషన్‌..! అక్కడ సమయం గడవదు..

Apr 13 2026 5:40 PM | Updated on Apr 13 2026 5:44 PM

Travel Tips: Coorgs Beauty Revealed Why Coorg is Popular

ఎండాకాలం చల్లని ప్రయాణాలు చేయాల్సిందే అనుకుంటారు. కానీ, చాలా మందికి ఎక్కడికి వెళ్లాలి అనే కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. అలా కన్‌ఫ్యూజ్‌ అయ్యేవారికి కూర్గ్‌ ఒక పర్ఫెక్ట్‌ సమ్మర్‌ డెస్టినేషన్‌. తొలిసారి వెళ్లినా కూడా చాలా నేచురల్‌గా అనిపిస్తుంది.

కూర్గ్‌లో రోడ్ల పక్కనే కాఫీ ప్లాంటేషన్స్‌ మధ్య మధ్యలో జలపాతాలు, చిన్న చిన్న ఇళ్లతో కలిసి ఒక కామ్‌ అండ్‌ ఫ్రెష్‌ ఎన్విరాన్‌మెంట్‌ కనిపిస్తుంది. ఉదయం వేళలో వీచే గాలి కాఫీ ఘుమఘుమలను మోసుకొచ్చే మెసెంజర్‌లా మారి΄ోతుంది.

సందర్శనీయ స్థలాలు
అబ్బే ఫాల్స్‌ దగ్గర నీరు పడే శబ్దంలో ఒక ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఉంటుంది. రాజాస్‌ సీట్‌ నుండి వ్యాలీ చూస్తూ సూర్యోదయం మెల్లిగా విస్తరించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. దుబారే ఎలిఫెంట్‌ క్యాంప్‌ దగ్గర నేచర్‌ మధ్య రిలాక్స్‌ అయ్యే అవకాశం లభిస్తుంది.

ఏం తినాలి?
కూర్గ్‌ స్టైల్‌ మీల్స్‌లో స్పైసెస్‌ మైల్డ్‌గా, ఫ్లేవర్‌ రిచ్‌గా ఉంటాయి. ఇక్కడి నాన్‌ వెజ్‌ వంటకాలకు స్థానిక మసాలాలే ప్రత్యేకత. ఫ్రెష్‌ కాఫీ సిప్‌ చేస్తూ అక్కడి వైబ్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేయవచ్చు.

ఎప్పుడు వెళ్లాలి?
అక్టోబర్‌ నుంచి మార్చి వరకు వెదర్‌ చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అయితే చాలా మంది ఎండాకాలంలో కూడా వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. చలికాలంలో అయితే మిస్ట్, గ్రీనరీ, కూల్‌ బ్రీజ్‌ కలిసి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. ఎండాకాలం ఒక ప్రశాంతమైన అనుభవాన్ని సొంతం చేసుకునేందుకు, చల్లదనం కోసం కూర్గ్‌ వెళ్లవచ్చు.

హైదరాబాద్‌ నుంచి ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వరకు ప్లైట్‌లో సుమారు 90 నిమిషాలు ప్రయాణించాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5–6 గంటలు ప్రయాణించి కూర్గ్‌కు చేరుకోవచ్చు. కూర్గ్‌లో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటే గాలిలో కాఫీ సువాసన, ప్రశాంతత గుర్తుకొస్తాయి. అక్కడి స్లో లైఫ్‌ మనసులో చిరకాలం నిలిచిపోతుంది.  

బాలి, ఇండోనేషియా..!
కొన్ని ప్రదేశాల్లో మొదటి అడుగు వేయగానే మనసు తేలికపడిపోతుంది. అలాంటి ఫీలింగ్‌ను కలిగించే ఒక అందమైన ప్రదేశమే ఇండోనేషియాలోని బాలి. ఫస్ట్‌ టైమ్‌ ఇంటర్నేషనల్‌ ట్రిప్‌ చేసే ట్రావెలర్స్‌కు కూడా సులభంగా కనెక్ట్‌ అయ్యే వైబ్‌ ఉన్న ప్రదేశం ఇది. ఇక్కడి ప్రతీ చిన్న మూమెంట్‌లో ఒక రిలాక్స్‌డ్‌ ఫ్లో ఉంటుంది.

బాలి రోడ్‌ సైడ్‌లో కొబ్బరి చెట్లు, ఆలయాలు, చిన్న కేఫ్స్‌ కలిసి ఒక నేచురల్‌ రిథమ్‌ను క్రియేట్‌ చేస్తాయి. ఉదయం వేళలో పలచని సూర్యకాంతి, సాయంత్ర వేళలో సముద్రం పక్కనే చల్లని గాలి.. ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని చాలా కంఫర్టబుల్‌గా మార్చేస్తాయి. నడుస్తూ చూస్తూ వెళ్తే టైమ్‌ స్లోగా అయి΄ోయిన ఫీలింగ్‌ కలుగుతుంది.

సందర్శనీయ స్థలాలు
ఉబుద్‌లో గ్రీనరీ మధ్య ఉన్న ఆలయాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. తనాహ్‌ లాట్‌ ఆలయం సముద్రం పక్కన నిలిచిన దృశ్యంలో ఒక కామ్‌ ప్రెజెన్స్‌ ఉంటుంది. ఉలువాటు ఆలయం దగ్గర క్లిఫ్స్‌ మీద వేవ్స్‌ చూస్తూ ఉండటం ఒక స్మూత్‌ ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిలిపోతుంది.

ఏం తినాలి?
బాలిలో నాసి గొరేంగ్‌ అనే రైస్‌ డిష్‌ వార్మ్‌గా, లైట్‌ స్పైసెస్‌తో చాలా కంఫర్టింగ్‌గా ఉంటుంది. సాటే స్టిక్స్‌ ఫ్రెష్‌గా గ్రిల్‌ చేసి పక్కన సాస్‌తో సర్వ్‌ చేస్తారు. ఫ్రెష్‌ ఫ్రూట్స్, జ్యూసులు అక్కడ నేచురల్‌గా రిఫ్రెషింగ్‌ ఫీలింగ్‌ను ఇస్తాయి.

ఎప్పుడు వెళ్లాలి?
ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు వెదర్‌ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఈ సమయంలో బీచ్‌ వాక్స్, టెంపుల్‌ విజిట్స్, స్ట్రీట్స్‌లో నడవడం ఇవన్నీ మంచి మెమోరీస్‌గా మిగిలిపోతాయి. స్థానికులు నవ్వుతూ పలకరిస్తారు, దీంతో ఈ ప్రదేశం అందరికీ నచ్చేలా అనిపిస్తుంది.

హైదరాబాద్‌ నుంచి ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్‌ నుంచి బాలి కి కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ అందుబాటులో ఉంటాయి. ట్రావెల్‌ టైమ్‌ సుమారు 10 నుంచి 12 గంటలు ఉంటుంది. ఎయిర్‌పోఒర్ట్‌ నుంచి సిటీకి వెళ్లే రోడ్‌ జర్నీ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది.

బాలీలో గడిపిన సమయం ఓ అందమైన జ్ఞాపకంలా గుర్తుండిపోతుంది. అక్కడి స్లో లైఫ్‌ రిథమ్‌ మనసులో మరికొంత కాలం అలాగే నిలిచిపోతుంది.

(చదవండి: సమ్మర్‌లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్‌గా..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement