కొబ్బరి పొట్టు ఎరువుతో కూరగాయల సాగుపై ప్రత్యక్ష శిక్షణ

Training on Production of Fermented Cocopeat and Soilless Cultivation of Vegetables - Sakshi

కుండీలు, మడుల్లో మట్టిని వాడకుండా  ‘ఆర్క కొబ్బరి పొట్టు’తో కూరగాయల సాగు

ప్రత్యక్ష శిక్షణతోపాటు.. ఆన్‌లైన్‌ శిక్షణ కూడా.. 

పట్టణ/నగర ప్రాంతాల్లో కూరగాయల సాగు, టెర్రస్‌ కిచెన్‌ గార్డెనింగ్‌ ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో మట్టిని వాడకుండా, కొబ్బరి పొట్టుతోనే నారు మొక్కలు, కూరగాయల సాగుకు ప్రాముఖ్యం పెరుగుతోంది. శుద్ధి చేసిన కొబ్బరి పొట్టును బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) రూపొందించిన ఆర్క మైక్రోబియల్‌ కన్సార్షియం ద్రావణంతో పులియబెడితే.. పోషకాలతో కూడిన సేంద్రియ కొబ్బరి పొట్టు (అర్క ఫర్మెంటెడ్‌ కోకోపీట్‌– ఎ.ఎఫ్‌.సి.) సిద్ధమవుతుంది.

దీన్ని తయారు చేసుకోవటం.. మట్టి వాడకుండా కుండీలు, మడుల్లో నారు మొక్కలను, కూరగాయ మొక్కలను సాగు చేసుకోవటంపై ఆగస్టు 13న ఐఐహెచ్‌ఆర్‌ శాస్త్రవేత్తలు శిక్షణ ఇవ్వనున్నారు. బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌కు వెళ్లి ప్రత్యక్ష శిక్షణ పొందేవారు రూ. 2,000, జూమ్‌ ఆప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ పొందగోరే వారు రూ. 500 ఫీజుగా చెల్లించి, ఆగస్టు 11లోగా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆసక్తి గల వారెవరైనా శిక్షణకు అర్హులే. సేంద్రియ ఇంటిపంటల సాగును ఉపాధి మార్గంగా ఎంచుకోదలచిన వ్యక్తులు, స్టార్టప్‌లు, ఎఫ్‌.పి.ఓ.లు, వ్యవసాయ/ఉద్యాన విద్యార్థులు/పట్టభద్రులు ఎవరైనా శిక్షణ పొందవచ్చు. అభ్యర్థులు ఈ కింది లింక్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి.  https://forms.gle/tBYyusdJ9D2hgvQD6
bessthort@gmail.com

నాన్‌ పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌పై అడ్వాన్స్‌డ్‌ కోర్సు
పంటల సాగులో పురుగులు, తెగుళ్లకు సంబంధించిన మౌలికాంశాలను అర్థం చేసుకొని రసాయన రహిత పద్ధతుల్లో చీడపీడలను అరికట్టేందుకు ఉపయోగపడే మెలకువలను నేర్పించడానికి ఆగస్టు 5–7 తేదీల్లో గ్రామీణ అకాడమీ ‘నాన్‌ పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌పై అడ్వాన్స్‌డ్‌ కోర్సు’పై శిక్షణ ఇవ్వనుంది. జూమ్‌ ఆప్‌ ద్వారా మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్‌ఎ) కార్యనిర్వాహక సంచాలకులు, వ్యవసాయ శాస్త్రవేత్త డా. జీ వీ రామాంజనేయులు ఆంగ్లంలో శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 2,500. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 99850 16637  https://grameenacademy.in/courses/

సద్దుపల్లిలో ప్రతి శనివారం రైతులకు శిక్షణ 
ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరత్నంనాయుడు ప్రతి శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం (రామోజీ ఫిలిం సిటీ ఎదురు రోడ్డు) సద్దుపల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతి శనివారం ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు ఆయన శిక్షణ ఇస్తారు. ఆగస్టు 2 (సోమవారం) ఉ. 11 గంటలకు శిక్షణా తరగతులను ప్రారంభిస్తున్నట్లు ‘రైతునేస్తం’ వేంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 94905 59999 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top