యుద్ధం తెచ్చిన తీపి జ్ఞాపకం.. రైలునే మ్యూజియంగా మార్పు! | A Train Was Converted Into A Museum During World War II | Sakshi
Sakshi News home page

యుద్ధం తెచ్చిన తీపి జ్ఞాపకం.. రైలునే మ్యూజియంగా మార్పు!

Jun 9 2026 8:03 AM | Updated on Jun 9 2026 12:13 PM

A Train Was Converted Into A Museum During World War II

ఏ దేశమైనా, ఏ జాతి అయినా యుద్ధం అంటే చివరికి మిగిలేవి దారుణ మరణాలు, తీరని శోకాలే. రెండో ప్రపంచ యుద్ధం దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశాన్ని తీవ్రంగా బాధించింది. నాటి యుద్ధ కాలంలో ఫ్రాన్స్‌కి ప్రత్యక్షంగా సహకరించిన దేశం అమెరికా. యుద్ధం ముగిశాక అమెరికా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది.

ఆ సమయంలో అమెరికా అందించిన సహాయానికి కృతజ్ఞతగా ఫ్రాన్స్‌ మెర్సిట్రెయిన్‌ పేరుతో 1949లో 49 బోగీలున్న ఓ ప్రత్యేక రైలును పంపింది. ఫ్రాన్స్‌లో మెర్సి అంటే ధన్యవాదాలు అని అర్థం. ఈ రైలులో ఫ్రాన్స్‌ పౌరులు ఎన్నో విలువైన వస్తువులను, జ్ఞాపికలను, కళాత్మక చిత్రాలను బహుమానంగా పంపారు. ప్రస్తుతం అమెరికాకి స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ ఇచ్చిన మెర్సిట్రెయిన్‌ను 77 ఏళ్ల తర్వాత ‘గ్రాటిట్యూడ్‌ ట్రెయిన్‌’ పేరుతో ఓప్రాజెక్టు మొదలుపెట్టి అత్యంత సుందరంగా వింటేజ్‌ లో లుక్‌ తయారు చేసి రైలునే మ్యూజియంగా మార్చేశారు. ప్రస్తుతం ప్రదర్శన కోసం అందుబాటులో ఉంచారు. అలా నాటì  చేదు గురుతులు నేటి తీపి జ్ఞాపకాలుగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement