Kitchen Cleaning Tips: Top 5 Simple And Easy Tips To Get Rid Of Cooking Smell In Kitchen - Sakshi
Sakshi News home page

Kitchen Tips: కిచెన్‌లో దుర్వాసన పోవాలంటే! యాలకులు, లవంగాలు.. ఇంకా వీటితో ఇలా చేస్తే

Nov 17 2022 9:56 AM | Updated on Nov 17 2022 11:49 AM

Top 5 Easy And Simple Tips To Get Rid Of Cooking Smells In Kitchen - Sakshi

వంటగదిలో దుర్వాసనను పోగొట్టే ఈ సులువైన చిట్కాలు మీకోసం

కొన్ని రకాల వంటకాలు చేసినపుడు వంట గదిలో వాసనలు అలాగే ఉండిపోతాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి సులువైన చిట్కాలు మీకోసం..
చేపల వాసన పోవాలంటే
కిచెన్‌లో చేపల వాసనను పోగట్టడానికి నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది. గిన్నెలో వేడి నీరు తీసుకుని.. దానిలో నిమ్మరసం పిండండి. మీగిలిన తొక్కలను కూడా నీటిలోనే వేయండి. దీన్ని ఒక స్ప్రే డబ్బాలో పోసి వంటగదిలో స్ప్రే చేస్తే వాసన పోతుంది.

నిమ్మకాయతో ఇలా
మీ వంట గదిలో ఏదైనా ఘాటైన వాసన వస్తుంటే. నీటిలో నిమ్మకాయను సగం కట్‌ చేసి వేయండి. దీన్ని పది నిమిషాలు మరగనివ్వండి. తర్వతా గ్యాస్‌ కట్టేసి అలా వదిలేయండి. ఇలా చేస్తే మీ వంట గదిలోని ఘాటైన వాసన నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. దానిలో టేబుల్‌ స్పూన్‌  బేకింగ్‌ సోడా వేస్తే ఇంకా మంచి రిజల్ట్స్‌ వస్తాయి.

సుగంధ ద్రవ్యాలతో..
యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క.. లాంటి సువాసన వెదజల్లే మసాలా దినుసులను తీసుకొని వాటిని నీటిలో వేసి బాగా వేడిచేయాలి. ఇవి నీటిలో వేసి వేడి చేస్తే వంటగదిలో సువాసనలు వ్యాపిస్తాయి.

వంటగదిలోని దుర్వాసన పోతుంది. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి మీ ఇంట్లో స్ప్రే చేస్తే మంచి వాసన వస్తుంది. ఇది రూమ్‌ ఫ్రెష్‌నర్‌గా కూడా పనికొస్తుంది.

వెనిగర్‌
►ఇంట్లో నాన్‌వెజ్‌ వండినప్పుడు వచ్చే నీచు వాసనను వెనిగర్‌ ఈజీగా పొగొడుతుంది.
►దీనికోసం మూడు గిన్నెల్లో వెనిగర్‌ని పోసి కిచెన్లో‌ మూడు చోట్ల ఉంచాలి.
►10 నుంచి 15 నిమిషాల్లో మీకు మంచి రిజల్ట్స్‌ వస్తాయి.
►అయితే ఈ వాసన మరీ ఎక్కువగా ఉంటే.. వెడల్పాటి గిన్నెలో నీరు, వెనిగర్‌ తీసుకుని, దానిలో నిమ్మతొక్కలు వేయాలి.

►తర్వాత ఈ నీటిని గ్యాస్‌ ఉంచి సువాసనలు వెదజల్లేంత వరకు సిమ్‌లో పెట్టి వేడి చేయాలి.
►తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి అలా ఉంచేస్తే కాసేపటికి కిచెన్‌లో దుర్వాసన పోతుంది.

కమలా తొక్కలతో..
►డస్ట్బిన్‌లోని చెత్త కారణంగా కొన్ని సార్లు వంటగదిలో దుర్వాసన వస్తుంది.
►ఈ సమయంలో ఒక గిన్నెలో నీరు పోసి దానిలో కాస్త దాల్చినచెక్క, కొన్ని కమలా తొక్కలు వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు మరిగించండి.
►గిన్నెను అలాగే ఉంచేస్తే.. దుర్వాసన పోయి.. సువాసన వస్తుంది.
►ఇక మీ వంటగదిలో కూర మాడిన వాసనలు పోగొట్టుకోవాలంటే... వంట గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచితే సరి! 

చదవండి: Psychology: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. పరిష్కారం?
మెదడులో కలవరం.. ఫిట్స్‌తో తస్మాత్‌ జాగ్రత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement