షుగర్‌ పేషెంట్స్‌.. పచ్చి కూరగాయలు, పండ్లు తింటున్నారా? | Sakshi
Sakshi News home page

Rich Fiber Supplements: ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారా? ఏమవుతుందో తెలుసా?

Published Wed, Nov 1 2023 1:17 PM

In A Study Says Rich Fiber Supplements May Improve Diabetes Control - Sakshi

ఇటీవలి కాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఆధునిక జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, వంశపార్యపరంగాగా, ఒత్తిడి..ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది టైప్‌-2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ప్రస్తుతం వయసులో సంబంధం లేకుండా అందరిలోనూ డయాబెటిస్‌ సమస్య వస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. 

డయాబెటిస్ అనేది మెటబాలిక్ కండిషన్. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే మీ డైట్‌లో తప్పకుండా ఫైబర్‌ ఫుడ్‌ని చేర్చుకోవాల్సిందే. ఎందుకంటే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించి..రక్తంలో గ్లూకోజ్ స్పైక్‌లను తగ్గిస్తుంది. దీంతో షుగర్‌ లెవల్స్‌ తగిన పరిమాణంలో ఉంటాయి. స్టార్‌(సర్వే ఫర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ డయాబెటిస్ విత్ ఫైబర్-రిచ్ న్యూట్రిషన్ డ్రింక్) జరిపిన అధ్యాయనంలోనూ ఇదే విషయం వెల్లడైంది.

టైప్‌-2 డయాబెటిస్‌ ఉన్న సుమారు 3,042మంది రోగులపై ఈ  పాన్‌ ఇండియా సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా మూడు నెలల పాటు ఫైబర్‌ రిచ్‌ సప్లిమెంట్స్‌ తీసుకున్న వారిని ఒక గ్రూపుగా, సప్లిమెంట్‌ తీసుకోనివారిని మరో గ్రూపుగా విభజించి వారిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది గమనించారు. 


గ్లూకోజ్‌ స్థాయి గణనీయంగా తగ్గింది
HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)స్థాయి గణనీయంగా 8.04 నుండి 7.32కి తగ్గింది
► సుమారు  82% మంది రోగులలో 3కిలోల వరకు బరువు తగ్గడం కనిపించింది.
► సప్లిమెంట్‌ తీసుకున్న వారు ఉత్సాహంగా ఉన్నట్లు గమనించారు. 
దీని ప్రకారం..ఫైబర్‌ రిచ్‌ సప్లిమెంట్‌ రోజువారి వినియోగంలో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను ఎలా నియంత్రిస్తుందన్నది సర్వే ఆధారంగా మరోసారి రుజువైంది. 

ప్రపంచవ్యాప్తంగా  డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఫైబర్‌ పాత్ర ఎంత ముఖ్యం అన్నది ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిపోయింది. RSSDI, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వంటి సంస్థలు కూడా మధుమేహం ఉన్నవారు  తమ డైట్‌లో రిచ్‌ ఫైబర్‌(పీచు పదార్థం) ఫుడ్స్‌ని తీసుకోవాల్సిందిఆ సిఫార్సు చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారు రోజుకి  25-40 గ్రా.ల ఫైబర్ తీసుకోవాల్సిందిగా RSSDI సిఫార్సు చేసింది. 

మధుమేహం నియంత్రణలో  సనైన పోషకాహారం పాటించడం ఎంతో అవసరమని సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ ఎండోక్రైన్ సొసైటీస్ (SAFES) ప్రెసిడెంట్, డాక్టర్ సంజయ్ కల్రా అన్నారు. మధుమేహంతో బాధపడేవాళ్లు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర వినియోగాన్ని తగ్గించడమే కాకుండా ఫైబర్‌ రిచ్‌ ఫుడ్స్‌ని పెంచుకోవాల్సిందిగా తెలిపారు. ఫైబర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం తిన్నా ఎక్కువ తిన్న అనుభూతిని కలిగించడమే కాకుండా, కడుపు నిండిన ఫీలింగ్‌ కలుగుతుంది. అంతేకాకుండా ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. 

ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలివే..

పచ్చి కూరగాయలు, పండ్లు
► గోధుమలు, ఓట్స్‌
► బ్రౌన్ రైస్,క్వినోవా, బార్లీ 
► జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్‌
► బీన్స్, ధాన్యాలు
► అవిసె గింజలు
► బ్రకోలి,యాపిల్‌
► స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు,బ్లూబెర్రీలు
► అరటి పండు, అవకాడో మొదలైనవి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement