వీటి గురించి మీరెప్పుడైనా పూర్తిగా తెలుసుకున్నారా! | Strange And New Things About Ambulances And Eagles | Sakshi
Sakshi News home page

వీటి గురించి మీరెప్పుడైనా పూర్తిగా తెలుసుకున్నారా!

May 27 2026 1:29 PM | Updated on May 27 2026 2:04 PM

Strange And New Things About Ambulances And Eagles

మనం కొత్త విషయాలను తెలుకోవాలంటే ఎంతో ఆసక్తిని చూపుతాం కదూ..! అలాగే, ఈ మారుతున్న ప్రకృతికనుగుణంగా జీవులలో అయినా, వస్తువులోనైనా మార్పులు రావడం సహజం. అలాంటి వింతైన మార్పులు, సరికొత్త విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

అంబులెన్స్‌..
మీకు అంబులెన్స్‌ తెలుసు కదా ఫ్రెండ్స్‌! ఆపదలో ఉన్న వారిని వైద్యం కోసం ఆసుపత్రికి చేర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది ఇది. మరి ఈ అంబులెన్స్‌ సేవలు ఎప్పటినుంచి, ఎలా ్రపారంభమయ్యాయో తెలుసుకుందామా! లాటిన్‌ భాషలో ‘అంబులేర్‌’ అంటే ‘నడవడం’ లేదా ’కదలడం’ అని అర్థం.

పూర్వకాలంలో యుద్ధంలో గాయపడిన సైనికులను నడిపించుకుంటూ లేదా మోసుకుంటూ చికిత్స కోసం తీసుకెళ్లేవారు. అలా కదిలే ఒక చిన్న ఆసుపత్రి లాంటి దాన్నే ‘అంబులెన్స్‌’ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తరువాత 1487 లో స్పెయిన్‌లో జరిగిన ఒక యుద్ధ సమయంలో మొదటిసారిగా అంబులెన్స్‌ అనే ఆలోచన వచ్చింది. అప్పట్లో ఇప్పటిలా కార్లు, వ్యాన్లు లేవు కదా! అందుకని గుర్రపు బండ్లనే అంబులెన్సులుగా మార్చేశారు.

యుద్ధంలో గాయపడిన సైనికులను ఆ గుర్రపు బండ్లలో పడుకోబెట్టి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లేవారు. అలా సమయం గడుస్తున్న కొద్దీ అంబులెన్స్‌ రూపం పూర్తిగా మారిపోయింది. 1832 లండన్‌ నగరంలో కలరా వ్యాధి వచ్చినప్పుడు మొదటిసారి అంబులెన్స్‌ వాడారు. అలా 1970 తర్వాత అంబులెన్స్‌ లోపల కేవలం రోగిని పడుకోబెట్టడమే కాకుండా, ఆక్సిజన్‌ సిలిండర్లు, డాక్టర్లు, మందులు ఉంచడం మొదలుపెట్టారు.

గద్దలు.. వీటికి ముక్కే ముఖ్యం..!
మనం భోజనం చేశాక చేతులు, మూతి శుభ్రంగా కడుక్కుంటాం కదా ఫ్రెండ్స్‌! గద్దలు కూడా అలానే చేస్తుంటాయి. వాటికి చేతులు లేవు కదా అంటారా.. అవి ముక్కు ద్వారా ఆహారం తీసుకుంటాయి కదా.. అందుకే నిత్యం ముక్కును శుభ్రంచేసుకుంటూ ఉంటాయి. 

ఇందుకోసం అవి తమ ముక్కును చెట్ల కొమ్మలకు లేదా గరుకుగా ఉండే రాళ్లకు అటు ఇటు గట్టిగా రుద్దుతాయి. ఇలా చేయడం వల్ల అవి వేటాడినపుడు వాటి ముక్కుకు అంటివుండే మాంసం ముక్కలు, రక్తం తొలగిపోతాయి. లేదంటే అక్కడ బ్యాక్టీరియా చేరి వాటికీ జబ్బులు వస్తాయి.

అంతేకాకుండా గద్దల ముక్కు మన గోళ్లలాగే ‘కెరాటిన్‌’ అనే పదార్థంతో తయారవుతుంది. ఇది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి, గరుకు రాళ్లకు రుద్ది.. ముక్కు అంచులను ఎప్పుడూ కత్తిలా పదునుగా ఉంచుకుంటాయి. అప్పుడే అవి వేటాడిన జంతువుల చర్మాన్ని ఈజీగా చీల్చగలవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement