ఎగ్‌లెస్‌ ఆమ్లెట్‌ తిన్నారా...!

Story About Eggless Omelette - Sakshi

అవును మీరు చదివింది కరెక్టే.. ఎగ్‌లెస్‌ కేక్‌ తిన్నాం కానీ.. ఎగ్‌ లేకుండా ఆమ్లెట్‌ ఏంటీ అనుకుంటున్నారా... మొక్కల ప్రొటీన్లతో తయారు చేసే ఆమ్లెటే ఎగ్‌లెస్‌ ఆమ్లెట్‌. దీనినే వీగన్‌ ఆమ్లెట్‌ అని కూడా అంటారు. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న డైట్‌ ‘వీగన్‌ డైట్‌’. ఈ ఆహారపు ముఖ్య లక్ష్యం.. మనిషి తిండికోసం ఏ జీవినీ బాధించకపోవడమే.. అందుకే వీగన్‌ డైట్‌ ఫాలోవర్స్‌ అంతా మాంసం, గుడ్డు, చేపలు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, తేనె వంటివేవీ ఆహారంగా తీసుకోరు. అయితే ఈ డైట్‌ ఫాలో అయ్యే వాళ్ల కోసం ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ‘ఇవో ఫుడ్స్‌’ అనే ఓ స్టార్టప్‌ రెస్టారెంట్‌ మొక్కల ప్రొటీన్ల నుంచి వీగన్‌ ఎగ్స్‌ను తయారు చేసి వాటితో ఆమ్లెట్స్, ఎగ్‌రోల్స్, వివిధ రకాల ఎగ్‌వెరైటీ డిష్‌లను అందిస్తోంది.

 అయితే ఎగ్స్‌ వాడకుండా చేసే ఆమ్లెట్‌ టేస్ట్‌ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా..? వీగన్‌ ఎగ్స్‌తో చేసినప్పటికీ దీని రుచి నిజమైన గుడ్లతో తయారు చేసిన ఆమ్లెట్‌లానే ఉంటుందని రుచి చూసిన వారంతా చెబుతున్నారు.

లిక్విడ్‌ ఎగ్‌..
ఫ్యాబేసీ కుటుంబానికి  చెందిన లెగ్యుమ్‌ మొక్కల నుంచి ప్రొటీన్లను సేకరించి వాటికి విటమిన్‌ డి3, బి12లు కలిపి లిక్విడ్‌ రూపంలో ఎగ్‌ను తయారు చేస్తారు. ఆ తరువాత సాధారణ ఎగ్‌తో చేసే అన్ని రకాల డిష్‌లను దీనితో తయారు చేస్తున్నట్లు్ల రెస్టారెంట్‌ యాజమాన్యం వెల్లడించింది. రుచి కూడా చాలా బాగుంటుందని, జంతు ప్రేమికులకు, వీగన్‌ డైట్‌ ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఆప్షన్‌ అని యాజమాన్యం చెబుతోంది. మీరు వీగన్‌ డైట్‌ను ఫాలో అవుతున్నారా.. అయితే ఒకసారి ఎగ్‌లెస్‌ ఆమ్లెట్‌ రుచి చూసేయండి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top