స్మార్ట్‌ ప్రెషర్‌ కుకర్‌.. బ్లూ టూత్‌ కనెక్ట్‌తో! | Smart Bluetooth Pressure Cooker Details | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ ప్రెషర్‌ కుకర్‌.. బ్లూ టూత్‌ కనెక్ట్‌తో!

Feb 27 2022 5:48 PM | Updated on Feb 27 2022 7:50 PM

Smart Bluetooth Pressure Cooker Details - Sakshi

వంటరాకున్నా వండి పెట్టే మెషిన్‌  ఇంట్లో ఉంటే.. ఆ సౌకర్యమే వేరప్పా అనిపిస్తుంది కదూ! అలాంటిదే ఈ మేకర్‌ (స్మార్ట్‌ ప్రెషర్‌ కుకర్‌). స్మార్ట్‌ ఫోన్‌ లో దానికి సంబంధించిన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, ఈ స్మార్ట్‌ కుకర్‌కి బ్లూ టూత్‌ సాయంతో కనెక్ట్‌ చేసుకోవాలి. 600 వంటలకు పైగా రెసిపీలతో పాటు.. ఎలా చెయ్యాలో దేని తర్వాత ఏం వెయ్యాలో, ఎంత మోతాదులో వెయ్యాలో.. ఇలా అన్నిటినీ వివరించే వీడియోలు అందుబాటులో ఉంటాయి. కొలత కొలిచే కప్పులతో అవసరం లేదు. నాలుగు ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సెన్సార్‌లు.. పదార్థాలను కచ్చిత పరిమాణంలో కొలుస్తాయి.

వండే వంటకాన్ని బట్టి ఎంత వాటర్‌ అవసరమో కూడా అడిగి తీసుకుంటుంది. దీనికి టైమ్‌ సెట్‌ చెయ్యాల్సిన పనిలేదు. టెంపరేచర్‌ తగ్గించడం, పెంచుకోవడంతో సంబంధం లేదు. దీని మెనులో ప్రతి వారం అదనంగా 5 రెసిపీలు చేరుతూ ఉంటాయి. ప్రెషర్‌ కుకర్, స్లో కుకర్, స్మార్ట్‌ కుకర్, స్టీమర్‌.. ఇలా చాలా రకాలుగా దీన్ని వినియోగించుకోవచ్చు. స్టీమ్‌ బాస్కెట్, స్టీమ్‌ ర్యాక్, సిలికాన్‌ లిడ్‌ (మూత), ప్రెషర్‌ లిడ్‌లతో పాటు రెండు గ్యాస్‌కట్‌లూ ఈ కుకర్‌ తోడుగా  లభిస్తాయి. భలే బాగుంది కదూ!
ధర 204 డాలర్లు
 (రూ.15,233)

Advertisement
 
Advertisement
Advertisement