ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..! | Shocking Discovery, Ancient Gut Bacteria Found Alive Inside Mummy, How Did Microbes Survive 5,000 Years? | Sakshi
Sakshi News home page

ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..! అతడి చివరి భోజనం..

Jun 3 2026 9:34 AM | Updated on Jun 3 2026 10:16 AM

Shocking Living Organism Found Growing Inside Mummy

నిజంగా జీవంలేని ఏ ప్రాణిలోని కణాలు గానీ సూక్ష్మజీవులు గానీ బతికే ఛాన్స్‌ ఉండదు. అది కూడా వేల ఏళ్ల నాటి మమ్మీ లాంటి వాటిల్లో కూడా ఉండవనేది జగమెరిగిన సత్యం. ఒక జీవిలో ప్రాణం లేకపోతే..అచైతన్యంగా..నిర్జీవంగా అయిపోతుంది లేదా కొన్ని రోజులకి విచ్ఛిన్నమైపోతుంది. అలాంటిది వేల ఏళ్ల నాటి మమ్మీ అది కూడా గడ్డకట్టిన చలిలో ఉన్న మృతదేహంలో సజీవంగా పేగు బ్యాక్టీరియా ఉండటాన్ని చూసి విస్తుపోయారు శాస్త్రవేత్తలు

ఇటాలియన్‌ ఆల్ప్స్‌ పర్వతాల్లో ఓట్జీ ది ఐస్‌మ్యాన్‌ బాణం దెబ్బకు గురై చనిపోయాడు. కానీ అతని శరీరం గట్‌ బ్యాక్టీరియాతో కళకళలాడుతుండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. ఇది అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ. ఇక్కడ చరిత్ర పూర్వపు ప్రేగు బ్యాక్టీరియా చలికి ఇంకా బతికే ఉండటం అనేది విశేషం. ఆ చలి వాతావరణానికి అనుగుణంగా ఈస్ట్‌ జాతులు జీవక్రియపరంగా చురుకుగా ఉన్నాయని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ పురాతన సూక్ష్మజీవులు తమ కళ్లముందే చురుకుగా తమను తాము మార్చుకుంటూ పరిణామం చెందుతున్నాయని చెబుతున్నారు. 

వీటిని మమ్మీ చర్మం, అంతర్గత కణజాలాలు, కరిగిన మంచు నీటిని విశ్లేషించడం ద్వారా ఈ రహస్య పూర్వ జీవావరణ వ్యవస్థను గుర్తించినట్లు తెలిపారు. ఒక రకంగా ఈ పరిశోధన మన గతాన్ని తెలిపే అద్భుతమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు. అంతేగాదు చనిపోయిన ఆ వ్యక్తి ఓట్జీ చివరి భోజనమైన అధిక కొవ్వు అడవి మాంసం, పురాతన​ ధ్యాన్యాలతో అతని పేగులోని క్రియాశీ బ్యాక్టీరియా కచ్చితంగా సరిపోలిందన్నారు. 

ఆ వ్యక్తిలో రోంబౌట్సియా హోమినిస్, క్లోస్ట్రిడియం మోనిలిఫార్మ్ వంటి అరుదైన గట్‌ బ్యాక్టీరియాను గుర్తించినట్లు తెలిపారు. ఇది ఆధునిక మానువుల్లో దాదాపు కనుమరుగైందన్నారు. కానీ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని గిరిజన సముహాల్లో ఇలాంటి పేగు బ్యాక్టీరియా ఉందన్నారు. ఇవి శరీరాన్ని రక్షించేలా హానికరమైన క్రిమిసంహారకాలను తింటూ..మనుగడ సాగిస్తాయన్నారు.

(చదవండి: చింతగింజలతో మైక్రో ప్లాస్టిక్‌కి చెక్‌..!)

 

Advertisement
 
Advertisement
Advertisement