Sakshi News home page

ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..

Published Fri, Jan 26 2024 2:59 PM

Separated Twins At Birth In Same City Reunited After 19 Years - Sakshi

పుట్టుగానే కవలలు అనుకోని విపత్కర పరిస్థితుల్లో వేరయ్యారు. ఇద్దరు తమకు తెలియకుండానే ఒకే చోట నివశించారు. అయినా ఒకరికొకరు ఎదురవ్వలేదు. అనూహ్యంగా 19 ఏళ్ల తర్వాత ఒక వైరల్‌ టిక్‌టాక్‌ వీడియో, టీవీ షోలు  వారిద్దరిని ఆశ్చర్యకర రీతీలో కలిపాయి. అచ్చం ఓ సినిమా మాదిరిగా ఆధ్యాంతం ట్విస్ట్‌లతో సాగిన గాథ వారిది.

అసలేం జరిగిందంటే..యూరోపియన్‌ దేశమైన జార్జియాలో పుట్టిన ఇద్దరు కవలలు అమీ ఖ్విటియా, అనో సార్టానియా. ఈ ఇద్దరూ పుట్టగానే వేరయ్యారు. తెలియకుండానే ఒకే నగరం వేర్వేరుగా నివశించారు. తనకు ఇష్టమైన టీవీ షో 'జార్జియాస్ గాట్ టాలెంట్'లో నిమగ్నమైన అమీకి తన పోలికతో డ్యాన్స్ చేస్తున్న మరొకొ అమ్మాయిని చూసి ఒక్కసారిగా తడబడింది. తన పోలికతో ఉండి, డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయి చాలా కాల క్రితం వేరయ్యిన తన సోదరి అని ఆమెకు తెలియదు.

మరోవైపు అనోకు నీలిరంగు జుట్టుతో తనలానే ఉండే మరో అమ్మాయికి సంబంధిచిన టిక్‌టాక్‌ వీడియో ఆమెకు చేరింది.  వీడియోలో ఉన్న అమ్మాయి తన  కవల అమీ అని నిర్థారించుకుంది. దీంతో ఒకరినొకరు తామెవ్వరో తెలసుకుని షాక్‌కి గురయ్యారు. ఆ ఇద్దరూ కలిసి తాము వీడిపోవడానికి గల కారణాలు కనుగొని దిగ్బ్రాంతి చెందుతారు.

ఎందుకు వేరయ్యారంటే..
అజా షోని అనే మహిళ ఈ ఇద్దరి కవలలకు జన్మనిచ్చింది. 2002లో ఆ ఇద్దరికి జన్మనివ్వగానే అజా కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో అతడి తండ్రి గోచా గఖారియా దారుణ దుశ్చర్యకు పూనుకున్నడు. ఈ కవలలను వేర్వేరు కుటుంబాలకి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఇద్దరు కవలలు వేర్వేరు కుటుంబాల వద్ద ఒకే నగరంలో నివశించడం జరిగింది.

ఈ ఘటన జార్జియాను వేధిస్తున్న అతి పెద్ద సమస్య వెలుగెత్తి చూపింది. చాన్నాళ్లుగా ఆస్పత్రులో అపహరణకు గురవ్వుత్ను శిశువుల ఘటనలు ఇంతవరకు పరిష్కృతం కాలేదు. జార్జియన్ ఆసుపత్రుల నుంచి దొంగిలించబడి, విక్రయించబడిన వేలాది మంది శిశువులలో వారిద్దరి గురించి మాత్రమే తెలిసింది. మిగతా వారి ఆచూకి తెలియరాలేదు. 2005 వరకు జార్జియాలో ఆ తాలుకా కేసులు చాలా నమోదయ్యాయి. అవన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోవడం భాధకరం. ఈ కవలల గాథ 1972 నాటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'సీతా ఔర్ గీతా'ను తలిపించేలా జరగడం విశేషం. 

(చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!)
 

Advertisement

What’s your opinion

Advertisement