
మానవులకు చిన్నతనంలో పాలపళ్లు వచ్చి ఊడిపోతాయి. ఆ తర్వాత వచ్చేవి శాశ్వతంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. లేదంటే అంతే సంగతులు. అయితే తినే ఆహార పదార్ధాల వల్ల లేదా ఇతర అనారోగ్యాల కారణంగా దంతాలు ఊడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత కాస్త డబ్బులుంటే కొత్త దంతాలు కట్టించుకోవడం వంటివి చేస్తారు. అయితే ఒరిజనల్ దంతాల మాదిరి అనుభూతిని మాత్రం అందివ్వవు. ఆ సమస్యకు తాజాగా శాస్త్రవేత్తలు చెక్‌పెట్టి ఓ అసాధారణ ఘనతకు శ్రీకారం చుట్టారు. ల్యాబ్‌లో కృత్రిమంగా దంతాలను పెంచి దంత వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఇక ఇన్నాళ్లు చేయించుకున్న ఇంప్లాంట్ ట్రీట్‌మెంట్లకు గుడ్‌బై చెప్పేయొచ్చని చెబుతున్నారు.
లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకుల బృందం ఈ ఆవిష్కరణ చేసింది. దంతాల అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని సమర్థవంతంగా క్రియేట్ చేసి ఒక కణం, మరొక కణం కలిసి దంత కణంగా రూపాంతరం చెందిలే అభివృద్ధి చేశారు. అనేక జాతులు తమ దంతాలను పునరుత్పత్తి చేయగలిగినప్పటికీ..మానవులకు మాత్రం ఆ అవకాశం లేదు.
ఇన్నాళ్లు దంతాల సమస్యతో బాధపడుతున్నవారు లేదా దంతాలను కోల్పోయినా.. దంతాలను ఇంప్లాంటు చేయించుకునేవారు. అయితే ఇవి ఒరిజనల్ దంతాల మాదిరి సౌలభ్యాన్ని అందించలేకపోయేవి. ఇప్పుడు ఈ ఆవిష్కరణతో ఆ సమస్యకు చెక్‌పెట్టినట్లయింది. దంతాల సమస్యతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను అందించింది. ఈ బయోమెటీరియల్స్ కణాలు సహజ దంతాల మాదిరిగా విధులను నిర్వర్తించేలా దంతాల ఆకృతిని ఇంజనీర్ చేస్తుంది.
పునరుత్పత్తి అయిన ఈ దంత మొత్తం దంతాన్ని అభివృద్ధిచేస్తుందట. దంతాల నష్టంతో బాధపడే లక్షలాదిమందికి ఆ ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందట. ఈ మేరకు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ..జీవసంబంధమైన రీతీలోనే దంతం భర్తీ చేయాలన్న లక్ష్యం నెరవేరింది. తాము అభివృద్ధి చేసిన ఈ దంతాలు దవడలో కలిసిపోతాయి, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా బలంగా ఉంటాయని చెబుతున్నారు.
అయితే ఇక్కడ ల్యాబ్‌లో పెంచిన దంతాలను నోటిలో కూడా పెంచడం అనేదానిపై మన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. అయితే వైద్యలు మాత్రం పోయిన పంటి స్థానంలో దంత కణాలు మార్పిడి చేసి పెంచుతామని చెబుతున్నారు. ఇది పూర్తి స్థాయిలో విజయవంతమవ్వడానికి సమయం పట్టినా..దంత సంరక్షణలో అత్యాధునిక విధానంగా చెప్పొచ్చని అన్నారు పరిశోధకులు.
(చదవండి: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..! స్పెషాలిటీ ఏంటంటే..)