Green Dosalu Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్‌ దోసెలు! సాస్‌తో తింటే!

Recipes In Telugu: How To Prepare Green Dosalu - Sakshi

చిన్నా, పెద్దా ఇష్టంగా తినే అల్పాహారం దోసెలు.. రొటీన్‌గా కాకుండా ఈసారి ఇలా గ్రీన్‌ దోసెలు చేసుకుని తినండి. వైరైటీకి వెరైటీ.. రుచికి రుచి.

గ్రీన్‌ దోసెలు చేయడానికి  కావలసినవి:
►కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గుజ్జు – పావు కప్పు
►గోధుమ పిండి – 3 టేబుల్‌ స్పూన్లు
►మినపపప్పు –  ముప్పావు కప్పు (4 గంటల పాటు నానబెట్టుకోవాలి)
►మెంతులు – అర టీ స్పూన్‌ (4 గంటల పాటు నానబెట్టుకోవాలి)
►ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని
►నూనె – సరిపడా

గ్రీన్‌ దోసెలు- తయారీ:
►ముందుగా మినపప్పును, మెంతుల్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.
► ఒక గిన్నెలోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి.
►అందులో గోధుమ పిండి, తగినంత ఉప్పు, తగినన్నీ నీళ్లు పోసుకుని.. ఉండలు కట్టకుండా దోసెల పిండిలా బాగా కలుపుకోవాలి.
►తర్వాత స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పెనం వేడి చేసుకుని.. కొద్దిగా నూనె వేసుకుని దోసెలు వేసుకోవాలి.
►అభిరుచిని బట్టి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వంటివి దోసె మీద వేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.
►వేడివేడిగా ఉన్నప్పుడే నచ్చిన చట్నీతో లేదా సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి.

చదవండి👉🏾Sorakaya Juice: సొరకాయ జ్యూస్‌ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే! 
చదవండి👉🏾Chicken Keema Pakoda: రుచికరమైన చికెన్‌ కీమా పకోడా ఇలా ఇంట్లోనే ఈజీగా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top