Recipe: క్యారెట్‌, బీట్‌ రూట్‌ తురుము.. ఎగ్‌ బుర్జీ బాల్స్‌ తయారీ ఇలా! | Recipes In Telugu: How To Make Egg Bhurji Balls | Sakshi
Sakshi News home page

Egg Bhurji Balls Recipe: క్యారెట్‌, బీట్‌ రూట్‌ తురుము.. ఎగ్‌ బుర్జీ బాల్స్‌ తయారీ ఇలా!

Jul 5 2022 3:54 PM | Updated on Jul 5 2022 5:06 PM

Recipes In Telugu: How To Make Egg Bhurji Balls - Sakshi

ఎగ్‌ బుర్జీ బాల్స్‌ ఇలా సులువైన పద్ధతిలో ఇంట్లో తయారు చేసుకోండి!

ఎగ్‌ బుర్జీ బాల్స్‌ తయారీకి కావలసినవి:
బ్రెడ్‌ పౌడర్‌ – పావు కప్పు + 3 టేబుల్‌ స్పూన్లు
గుడ్లు – 6, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌
ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు (చిన్నగా తరిగినవి)
కారం, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు – కొద్దికొద్దిగా
మైదా పిండి – 2 లేదా 3 టేబుల్‌ స్పూన్లు (కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి)
 క్యారెట్‌ తురుము, బీట్‌ రూట్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్ల చొప్పున ( అభిరుచిని బట్టి)
నూనె – సరిపడా

తయారీ:
ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు వేసుకుని బాగా కలపాలి.
కళాయిలో నూనె వేసి ఆమ్లెట్‌లా వేసి..  నిమిషం పాటు కదపకుండా ఉంచాలి.
అనంతరం గరిటెతో కలియతిప్పి.. బుర్జీలా చేసుకోవాలి.
స్టవ్‌ ఆఫ్‌ చేసి, చల్లారిన తర్వాత అందులో పావు కప్పు బ్రెడ్‌ పౌడర్, క్యారెట్‌ తురుము, బీట్‌ రూట్‌ తురుము వేసుకుని బాగా కలపాలి.
కొద్దిగా ఉప్పు జోడించి.. బాల్స్‌లా చేసుకోవాలి.
వాటిని మైదా పిండి పేస్ట్‌లో ముంచి.. మిగిలిన బ్రెడ్‌ పౌడర్‌లో దొర్లించి.. నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

ఇవి కూడా ట్రై చేయండి:  Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి!
Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్‌.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా!

Advertisement
 
Advertisement
Advertisement