Recipe: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి! | Recipes In Telugu: How To Make Panasa Ginjala Vadalu | Sakshi
Sakshi News home page

Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి!

Jul 4 2022 11:57 AM | Updated on Jul 4 2022 12:05 PM

Recipes In Telugu: How To Make Panasa Ginjala Vadalu - Sakshi

పనస గింజల వడల తయారీ విధానం తెలుసా?

పనస గింజల వడల తయారీకి కావలసినవి:
►పనస గింజలు – ఒకటిన్నర కప్పులు (పైతొక్క తీసి, మెత్తగా ఉడికించుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి)
►ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నచిన్నగా తరగాలి)
►పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌  (చిన్నగా తరిగినవి)
►కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము – అర టేబుల్‌ స్పూన్‌    చొప్పున
►అల్లం పేస్ట్, మిరియాల పొడి, వాము – అర టీ స్పూన్‌    చొప్పున
►కారం, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

పనస గింజల వడల తయారీ విధానం
►ముందుగా ఒక బౌల్‌లో పనస గింజల గుజ్జు వేయాలి
►దానిలో.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
►అందులో కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, అల్లం పేస్ట్, మిరియాల పొడి, వాము అన్నీ కలిపి బాగా ముద్దలా చేసుకోవాలి.
►అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని.. వేళ్లతో గట్టిగా ఒత్తి, పలుచగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. 

ఇవి కూడా ట్రై చేయండి: Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్‌ తయారీ ఇలా!
ఇవన్నీ కలిపి బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే!
మరిన్ని రెసిపీల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement