
తన జీవితంలో ముఖ్యమైన శుభవార్తను ప్రకటించింది నటి పరిణీతి చోప్రా. త్వరలోనే తామెతొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో తన అభిమానుల అభినందనలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు కాబోయే పరిణీతి, రాఘవ్ చద్దాకు అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సినీ,ఇండస్ట్రీ మొత్తం అభినందించింది.
ఈ జంట ఆగస్టు 25 న ఇన్‌స్టాగ్రామ్‌లో “1 + 1 = 3”, కేక్ , చిన్న పాదముద్రలను కలిగి ఉన్న ఒక అందమైన పోస్ట్‌ను పంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో పరిణీతి చోప్రా గర్భవతి అని తెలియగానే నటు కియారా అద్వానీ , నేహా ధూపియా, సోనమ్ కపూర్, భూమి పెడ్నేకర్, హుమా ఖురేషి రకుల్ ప్రీత్ సింగ్ ఇలా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో పరిణీతి సోదరి 'మిమి దీదీ' ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తెగ సంతోషడిపోయింది. పరిణీతి పోస్ట్‌ను ప్రియాంక కూడా తిరిగి షేర్ చేసి, త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న వారిని అభినందించింది. దీంతో ప్రియాంక, పరిణీతి వివాహాన్ని మిస్ అయిన తర్వాత, ఇద్దరు సోదరీమణుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని పుకార్లను తోసి పుచ్చింది.
ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025 : ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?
పరిణీతి చోప్రా రాఘవ్ చద్దాల ప్రేమకథ మే 13, 2023న న్యూఢిల్లీలో వారి నిశ్చితార్థం తరువాత వెలుగులోకి వచ్చింది. ఈ జంట సెప్టెంబర్ 24, 2023న ఉదయపూర్‌లోని విలాసవంతమైన లీలా ప్యాలెస్‌లో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.