
పోషకాహార లోపం మనుషులనే కాదు.. జంతువులనూ వేధిస్తోంది.. ఈ విషయాలు తాజాగా జాతీయ స్థాయిలో ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. నగర జీవనశైలికి అనుగుణంగా ఆహారం అవసరం ఉంటుందని, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని పెంపుడు జంతువుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోందని ఆ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ప్రతి పది జంతువుల్లో తొమ్మిదిట్లో ఈ తరహా లోపం కనిపిస్తోందని, తగిన జాగ్రత్తలు పాటిస్తే సమస్యను అధిగమించొచ్చని పెట్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు జంతుప్రేమికులకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టాయి. నగరంలోని పెట్ లవర్స్‌ని ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించారు.
ప్రస్తుత నగర జీవనశైలిలో పెంపుడు జంతువులు ఓ భాగంగా మారాయి. కొందరు జంతువులపట్ల ప్రేమతో పెంచుకుంటుంటే.. మరికొందరు స్టేటస్ సింబల్ కోసం.. ఇంకొందరు బిజీలైఫ్‌లో కాసేపు ఒత్తిడిని తగ్గించుకునేందుకు మంచి తోడు కోసం.. తమ భావాలను వాటితో పంచుకునేందుకు పెంచుకుంటుంటారు.. ఇందులో ముఖ్యంగా పిల్లులు, కుక్కలు, కొన్ని రకాల పక్షులు కీలకంగా మారాయి.
అయితే చాలా మంది ఇంటి సభ్యులు మాదిరిగానే వాటినీ చూసుకుంటుంటారు.. వారు తినే భోజనాన్నే వాటికీ ఆహారంగా పెడుతుంటారు. ఎంతో ప్రేమతో మచి్చక చేసుకుని, వాటిని హత్తుకుంటూ వాటిని పెంచుకుంటుంటారు చాలా మంది యజమానులు. అయితే మరీ ముఖ్యమైన విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆహారం పెట్టడం వల్ల వాటి పోషకాహార అవసరాలు తీరడంలేదనేది నిపుణులు చెబుతున్న మాట.
సర్వే ఏం చెబుతోంది?
నగరాల్లో పెంపుడు జంతువుల్లో ఇటీవల దేశంలోని పశువైద్యులను సంప్రదించి నిర్వహించిన సర్వేలో ప్రతి పది పెంపుడు జంతువుల్లో తొమ్మిదిట్లో సరైన పోషకాహారం అందడంలేదనే ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూట్రిషన్ విషయంలో విశేష సేవలందిస్తున్న మార్స్ సంస్థ ‘పెట్స్‌ని కుటుంబంలా ప్రేమించండి.. కానీ వాటికి కావాల్సినదే ఆహారంగా పెట్టండి’ అనే సందేశంతో సరికొత్త ప్రచారానికి తెరతీశారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని పెట్స్ యజమానుల భావోద్వేగాలకు అనుగుణంగా రూపొందించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియోలు ఆయా గ్రూపుల్లోనూ, అఫీషియల్ ఫాలోవర్స్ పేజీల్లోనూ చెక్కర్లు కొడుతున్నాయి.
సాధారణంగా ఇళ్లల్లో పెంచుకునే పెట్స్ జీవనశైలి, వాటి దైనందిన జీవితం, వాటి మనుగడకు కాస్త ప్రత్యేకమైనది. వాటికి అనువైన ఆహారం అందించకపోవడం వల్ల మనుషుల్లానే అవి కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నాయని ఇటీవలి సర్వేలో వెల్ల్లడయ్యింది. దేశంలోని పశువైద్యుల సర్వే ప్రకారం.. 91% పశువైద్యులు వాటి జీవన, జీర్ణ క్రియ ఆధారంగా రూపొందించిన ప్యాకేజ్డ్ పెట్ ఫుడ్ వాడాలనే సూచన చేస్తున్నారు.
88% మంది ఇంట్లో వండిన ఆహారం పోషకపరంగా తక్కువగా ఉందని, 86% మంది తగిన పోషకాలు లేకపోవడం వల్ల జంతువులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మసమస్యలు, అరుగుదల లోపం, శక్తిలేమి లాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు పెరుగుతున్నాయట.
సమతుల ఆహారం..
పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పెడిగ్రీ, విస్కాస్ వంటి పలు బ్రాండ్ల ఆహారం, వాటి శరీర ధర్మానుసారం సమతుల పోషకాలను అందిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిని వాల్‌థామ్ సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు రూపొందించగా, అవి జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు పలువురు యజమానులూ, వైద్యులూ చెబుతున్నారు.
ఈ కారణంగా, లైఫ్‌స్టైల్ కోణంలో పెంపుడు జంతువుల పోషకాహారంపై స్పష్టమైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లి, కుక్కకు మనం తినేది కాకుండా, వాటికి అవసరమైనదే పెట్టాలి.., ఇది ప్రేమతో కూడిన శాస్త్రీయ సంరక్షణకు మొదటి అడుగు అని సూచిస్తున్నారు. అయితే ప్యాకేజింగ్ ఫుడ్ మాత్రమే పెట్టాల్సిన అవసరం ఉందా? అంటే.. వాటి సహజ జీవనశైలికి అనుగుణంగా ఉండే ఆహారాన్ని పెట్టినా సరిపోతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..)