
ప్రముఖ వ్యాపారవేత్త, RPG ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గోయెంకా (Harsh Goenka) ఆహార ప్రియుడు. తరచుగా సోషల్ మీడియాలో తనకు ఆహారం పట్ల ఉన్న ప్రేమ గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆహార ప్రియులకు ఎంతో ఇష్టమైన పానీ పూరీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర రెసిపీని పంచుకున్నారు. అందులోనూ తనకిష్టమైన ట్రీట్‌లలో ఒకదాని రెసిపీని పంచుకోవడం విశేషంగా నిలిచింది.
>
పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో ఆయనలోని భోజన ప్రియుడు మరోసారి మనకు దర్శనమిస్తాడు. వ్యాపారానికిమించి, తరచూ ఆసక్తికర విషయాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉండటం హర్ష గోయెంకాకు బాగా అలవాటు. పాపులర్ స్ట్రీట్ ఫుడ్ (Street Food) పానీ పూరీ (Pani Puri)ని గుర్తు చేస్తుందీ అంటూ ఆలూ రెసిపీ షేర్ చేశారు. అదే బంగాళాదుంపలను ఉపయోగించి తయారుచేసిన క్రిస్పీ ఫ్రైడ్ ఫ్రెంచ్ డెలికేసీ రెసిపీ.
విదేశాలకు వెళ్ళినప్పుడు పోమ్మెస్ సౌఫ్లీస్ అనే ఫ్రెంచ్ ఫ్రైడ్ బంగాళాదుంప వంటకాన్ని ఆస్వాదించినట్టు హర్ష గోయెంకా తెలిపారు. ఈ క్రిస్పీ డిలైట్‌ను పానీ పూరితో పోల్చారు. "ఇవి మన పానీపూరీల్లాగే ఉంటాయి. కానీ ఎవరూ వాటిని ఎందుకు తయారు చేయరా.. అని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది’’ అన్నారు. టేస్ట్ పానీ పూరీలా ఉండకపోవచ్చు..కానీ గాలిమాత్రం ఉంటుంది అంటూ చమత్కరించారు.
చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
ఇంతకీ దీని రెసిపీ ఏంటంటే..
లండన్ లేదా పారిస్‌లో హర్ష గోయెంకాకు ఇష్టమైన వాటిలో ఒకటి - పొమ్మెస్ సౌఫిల్స్.
ఎలా తయారు చేయాలి:
బంగాళాదుంపలను చాలా సన్నగా ముక్కలుగా కట్ చేసిన బాగా ఆరబెట్టాలి..
మీడియం-వేడి నూనెలో (150°C) తేలికగా సెట్ అయ్యే వరకు ఒకసారి వేయించాలి.
వాటిని నూనె నుండి బయటకు తీసిన తర్వాత, కొద్దిసేపు ఆరనివ్వాలి.
మళ్ళీ వేడి నూనెలో (190°C) వేయించాలి . దీంతో అవి అద్భుతంగా ఉబ్బుతాయి!
వీటిపై సాల్ట్ చల్లుకొని వేడిగా ఆరగించడమే.
దీనిపై నెటిజన్ల కామెంట్లతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి : రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్‌వీడియో