Old viral video: పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా..

Old Viral Video A Lion Accidentally Fallen Into Water Hole - Sakshi

ఎటో చూస్తూ నడిస్తే ఎంతటి వారైనా బొక్కబోర్లా పడాల్సిందే! అందుకు ఎవరూ అతీతులు కాదని.. సాక్షాత్తు మృగరాజే నిరూపించింది. అసలేం జరిగిందంటే..

జర్మన్‌ జూ పార్క్‌లో రెండు సింహాలు ఒక నీటిగుంట గట్టు మీద క్యాజువల్‌గా నడుస్తున్నాయి. ఇంతలో ఒక సింహం ఎటో చూస్తూ, నిర్లక్ష్యంగా నడుస్తూ, స్లిప్‌ అయ్యి నీటి గుంటలో పడిపోయింది. ముందు షాకయినప్పటికీ తర్వాత తేరుకుని నింపాదిగా ఈదుకుంటూ పైకి వచ్చింది. అయితే దానితో పాటే ఉన్న మరో సింహం మాత్రం కంగారు పడిపోయింది. నీళ్లలోనుంచి బయటికి వచ్చేంతవరకూ హడావిడిగా తిరగసాగింది.

2018 నాటి ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో మళ్లీ వైరల్‌ అవుతోంది.  ఐతే నెటిజన్లు మాత్రం ఈ వీడియోకు సరదాగా తమ అభిప్రాయాలను పోస్ట్‌ చేశారు. ‘గర్వం పతనానికి దారితీస్తుంది’అని ఒకరు కామెంట్‌ చేస్తే, ‘బుద్ధిలేని సింహం’ అని మరొకరు కామెంట్‌ చేశారు. ఏది ఏమైనప్పటికీ నవ్వు వచ్చేలా ఉన్న ఈ వీడియో సన్నివేశాన్ని మాత్రం వేల సంఖ్యలో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. 

చదవండి: ఈ రైళ్ల కూత కుక్కల అరుపులా ఉంటుంది.. ఐడియా అదుర్స్‌ కదూ..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top