పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్‌ ఏంటంటే..! | Sakshi
Sakshi News home page

పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్‌ ఏంటంటే..!

Published Tue, Apr 9 2024 3:22 PM

Nita Ambani Dazzles In A Graceful Paithani Saree  - Sakshi

రిలయన్స్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీ భార్య నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమర్థవంతమైన బిజినెస్‌ విమెన్‌గానూ, ఓ మంచి గృహిణిగా తల్లిగా, అన్నింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ దూసుకుపోతున్న​ శక్తిమంతమైన మహిళ ఆమె. రాబోయే తరాలకు స్పూర్తి ఆమె. అలాగే ఎప్పటికప్పుడూ ట్రెడిషన్‌కి తగ్గట్టు తనదైన ఫ్యాషన్‌ లుక్‌లో కనిపిస్తారు. ఇటీవల చిన్న కొడుకు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో కూడా నీతా స్పెషల్‌ ఎంట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె ధరించే అత్యంత ఖరీదైన చీరలు, నగలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి కూడా. అలానే ఈసారి నీతా ముఖేష్‌ అంబానీ కల్చర్‌ సెంటర్‌ వార్షికోత్సవంలో ధరించిన చీర కూడా హైలెట్‌గా నిలిచింది. ఆ చీరకు ఓ స్పెషాలిట కూడా ఉంది.

అదేంటంటే..స్టైల్‌కి స్పెషల్‌ సిగ్నేచర్‌ నీతా అంబానీ. హైప్రొఫైల్‌ వేడుకలకు తగ్గట్టుగా నీతా వస్త్రధారణ ఉంటుంది. ఇటీవల జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఏసీసీ) వార్షికోత్సవంలో కూడా అలాంటి ఆకర్షణీయమైన వస్తధారణతో హైలెట్‌గా నిలిచింది. ఆమె ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సంప్రదాయం ఉట్టిపడేలా పైథాని చీరలో వచ్చారు. చూపురులందర్నీ కట్టిపడేసేలా స్టన్నింగ్‌ లుక్‌లో సందడి చేసింది నీతా. ఈ చీర బంగారు జరీతో అజంతా గుహలను గుర్తుకు తెచ్చేలా పుష్పాలు, పక్షులతో డిజైన్‌ చేసి ఉంది.

చీరల రాణి..
చీర అంతా కూడా కమలా పువ్వులతో డిజైన్‌ చేసి ఉంది. నాటితరం చీరల నైపుణ్యం చాటిచెప్పేలా ఉంది ఆ చీర. అంతేగాదు మన దేశీ చీరల కళాకారులను గౌరవిద్దాం. చేతి వృత్తులను ప్రోత్సహించేలా వారు తయారు చేసిన చీరలనే దరిద్దాం అని సోషల్‌మీడియవేదికగా నీతా పిలుపునిచ్చారు. నిజానికి ఈ పైథాని చీరు మహారాష్ట్ర రాయల్‌ చీరగా పరిగణించే చీరల్లో ఒకటి. ఈ పైథాని చీరను స్వచ్ఛమైన పట్టుతో రూపొందిస్తారు. ఈ చీర డిజైన్‌ ముందు వైపు కనిపించినట్లే వెనుకవైపు డిజైన్‌ స్పష్టంగా కనిపిస్తుంది. చక్కగా చేతితో నేసిన చేనేత వస్త్రం.

ఈ చీర నేయాలంటే కళాకారుల వద్ద మంచి నైపుణ్యం ఉండాల్సిందే. ఇది భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు చాలా శ్రమతో ఈ పైథాని చీరలను రూపొందిస్తారు. దీన్ని చీరల రాణిగా పిలుస్తారు. అలాగే ఈ చీరను నకిలీ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇక ఇక్కడ నీతా కూడా భారతీయ కళలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఈ నీతా ముఖేష్‌ అబానీ కల్చర్‌ సెంటర్‌(ఎన్‌ఎంఏసీసీ) వార్షిక వేడుకలో దీన్నే గుర్తు చేసేలా ఆ పైథాని చీరతో కనిపించారు. అంతేగాదు మన భారతీయ కళల గొప్పదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు ఆమె. ఏ వేడుకైన హైలెట్‌ కావాలన్న, దాని ప్రాముఖ్యత తెలియజెప్పాలన్నా.. అందుకు తగ్గ వస్త్రాధారణతోనే సాధ్యమని నీతా చెప్పకనే చెప్పారు. దటీజ్‌ నీతా అంబానీ కదూ..!

(చదవండి: సమ్మర్‌లో డీహైడ్రేషన్‌కు చెక్‌పెట్టేవి ఇవే..!)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement