
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ అమెరికన్ నటి, మోడల్. అమెరికాలో మోడల్‌గా పనిచేసిన ఫక్రీ 2011లో బాలీవుడ్‌లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం రాక్‌స్టార్ మూవీతో ఉత్తమ మహిళా నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుని దక్కించుకుని అందర్నీ ఆకర్షించింది. నటన పరంగానే గాదు, గ్లామర్ పరంగానూ తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆకర్షణీయంగా ఉంటారామె. ఇటీవల సోహా అలీకాన్‌తో జరిగిన సంభాషణలో తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ వెల్లడించి అందరిని విస్తుపోయేలా చేశారు. తన లుక్ అంతలా ఉండటానికి తొమ్మిది రోజుల కఠిన ఉపవాసమేనని అంటోంది. దాని వల్ల తన ముఖంలో గ్లో వస్తుందని చెబుతోంది. నిజానికి అలాంటి ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనా..?. నిపుణులు ఏమంటున్నారంటే..
సోహా అలీఖాన్ సంభాషణలో తన లైఫ్‌స్టైల్ గురించి వెల్లడించింది. కెటిల్‌బెల్ వంటి వ్యాయామాలు చేస్తానని, 8 గంటలు నిద్ర తప్పనిసరి అంటూ తన బ్యూటీ రహస్యాలు షేర్ చేసుకున్నారు. అయితే తాను ఏడాదికి రెండుసార్లు కఠిన ఉపవాసం ఉంటానని ఆ సమయంలో అస్సలు ఏమి తినని చెప్పుకొచ్చింది. కేవలం నీళ్లు మాత్రమే తాగుతానని అంటోంది. దాని వల్ల ముఖం పీక్కుపోయినట్లు కనిపించినా..ఒక విధమైన గ్లో వస్తుందని చెప్పుకొచ్చిందామె.
అయితే ఇది కాస్తా కష్టమైనదని, ఎవ్వరూ ప్రయత్నించొద్దని సూచించారామె. ఇంకా తనకు బట్టర్ చికెన్, బిర్యానీ వంటి భారతీయ వంటకాలన్నా మహా ఇష్టమని తెలిపింది. అలాగే చర్మం ఆరోగ్యం కోసం హైడ్రేటెడ్‌గా ఉంటానని, మంచి నిద్ర, మినరల్స్, విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారమే తీసుకుంటానని చెప్పుకొచ్చారు నర్గీస్ ఫక్రీ.
వాటర్ ఫాస్టింగ్ మంచిదేనా..?
ఇది ఒకరకమైన ఉపవాసం. ఫ్యాట్ డైట్ పరంగా చేసే క్రేజీ ఫాస్టింగ్ అని చెబుతున్నారు. ఈ విధానంలో కేవలం నీటిని మాత్రమే తీసుకుంటారు. ప్రస్తుతం ఇది బాగా ట్రెండింగ్‌లో ఉంది. అలాగే పరిశోధనల్లో కేవలం నీటినే ఆహరంగా తీసుకుని ఉపవాసం ఉండే ఈ ప్రక్రియతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. అయితే ఇది ఎంతలా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. సరైన విధంగా చేయకపోతే అంతే స్థాయిలో ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
దుష్ప్రభావాలు..
దీని వల్ల నీటి ఉపవాసం నిర్జలీకరణం, కండరాల నష్టం, రక్తపోటు మార్పులు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆహారం లేకుండా ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. పైగా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, కండరాల నష్టం, రోగనిరోధక శక్తి తగ్గడం, అలసట, తలతిరగడం,, మతిమరుపు, జీవక్రియ మందగించడం తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
అలాగే అందరి వ్యక్తుల శరీర తీరు విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది అందరికి సరిపడదని అన్నారు.
ఇలాంటివి ఆరోగ్య నిపుణుల సమక్షంలో ఏ మేరకు చేయాలో నిర్ణయించి పాటిస్తేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: ఐరన్ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..)