Kruthika Kumaran: సహజమైన గెలుపు | Kruthika Kumaran, founder of sustainable beauty brand Vilvah | Sakshi
Sakshi News home page

Kruthika Kumaran: సహజమైన గెలుపు

Jul 12 2024 4:06 AM | Updated on Jul 12 2024 8:01 AM

Kruthika Kumaran, founder of sustainable beauty brand Vilvah

ఆర్గానిక్‌ స్కిన్‌కేర్‌

చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కుమార్తెను చూసి బాధ పడింది కృతిక కుమారన్‌. ఈ నేపథ్యంలోనే కెమికల్‌ ఫ్రీ ప్రోడక్ట్‌ల గురించి ఆలోచించింది. నేచురల్‌ కాస్మటాలజీలో డిప్లమా చేసిన తరువాత ప్రయోగాలు ప్రారంభించి విజయం సాధించింది. కోయంబత్తూరుకు చెందిన కృతిక కుమారన్‌ ఆర్గానిక్‌ స్కిన్‌కేర్‌ స్టార్టప్‌ ‘విల్వా’ సూపర్‌ సక్సెస్‌ అయింది...

తమిళనాడులోని గోబిచెట్టిపాళయం అనే ఉళ్లో పుట్టి పెరిగింది కృతి. తండ్రి లాయర్‌. తల్లి గృహిణి. ఉన్నత విద్య కోసం కోయంబత్తూరుకు వెళ్లిన కృతిక ‘కుమారగురు కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీలో బీటెక్‌ చేసింది. ఆ తరువాత తమిళ్‌ కుమారన్‌ అనే వస్త్ర వ్యాపారితో కృతికకు వివాహం జరిగింది.

కుమార్తెకు చర్మసమస్యలు వచ్చినప్పుడు మార్కెట్‌లోని కొన్ని సబ్బులు, షాంపులను ప్రయత్నించిందిగానీ అవేమీ ఫలితం ఇవ్వలేదు. దీంతో సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి సబ్బులు తయారు చేయాలని నిర్ణయించుకుంది. ‘కాస్మటాలజీలో డి΄÷్లమా చేయడం నుంచి యూ ట్యూబ్‌లో వీడియోలు చూడడం వరకు ఎన్నో అంశాలు నా ప్రయోగాలలో ఉపయోగపడ్డాయి’ అంటుంది కృతిక.

ముందుగా వంటగదిలో మేకపాలతో ప్రయోగాలు మొదలుపెట్టింది. కుటుంబసభ్యులు కూడా ఈ ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు. ‘అనేక ప్రయోగాల తరువాత విజయం సాధించాం. మొదట్లో రెండు మేకలు ఉండేవి. ఇప్పుడు మేకల మందలు ఉన్నాయి. వాటి తాజా పాలతో మా ప్రోడక్ట్స్‌ తయారు చేస్తున్నాం. హానికరమైన రసాయనాలకు దూరంగా ఉన్నాం’ అంటుంది కృతిక.

జుట్టు, చర్మసంరక్షణ ఇతర సౌందర్య ఉత్పత్తులతోపాటు లెమన్‌ గ్రాస్‌తో దోమల నివారణ మందును కూడా తయారు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోర్‌తో తొలి అడుగు వేశారు. రెండు సంవత్సరాల తరువాత వెబ్‌సైట్‌ను మొదలు పెట్టడంతో పాటు డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్‌లోకి వచ్చారు. అగ్రశ్రేణి డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌లతో కలిసి పని చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆఫ్‌లైన్‌ స్టోర్‌లకు కూడా శ్రీకారం చుట్టారు.

‘ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని షేర్‌ చేసినప్పుడు కోయంబత్తూరుతో పాటు చుట్టుపక్కల ్రపాంతాల నుంచి వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు వచ్చేవి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా లాంటి ఈ–కామర్స్‌ ΄్లాట్‌ఫామ్స్‌ మా ఉత్పత్తులను లిస్టింగ్‌ చేయడంతో వ్యాపారపరిధి విస్తరించింది’ అంటుంది కృతిక.

‘లాభాల దృష్టితో కాకుండా మా కంపెనీ ద్వారా రైతులు, చేతివృత్తుల కార్మికులకు ఏదో రకంగా ఉపయోగపడాలనుకుంటున్నాం. పర్యావరణ అనుకూల ΄్యాకేజింగ్‌లను ఉపయోగిస్తున్నాం’ అంటుంది కృతిక.

సంగీత, నృత్యాలలో ప్రవేశం ఉన్న కృతికకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తి. ఆ జిజ్ఞాస ఆమెను వ్యాపార దారిలోకి తీసుకువచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తిరుగులేని విజయం సాధించేలా చేసింది.      

ఇద్దరితో ్రపారంభమైన ‘విల్వా’లో ఇప్పుడు వందమందికి పైగా పనిచేస్తున్నారు. పదివేల రూపాయలతో మొదలైన కంపెనీ సంవత్సరం తిరిగేసరికల్లా కోటి రూపాయల టర్నోవర్‌కు  చేరింది. ఇప్పుడు కంపెనీ టర్నోవర్‌ 29 కోట్లు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement