వర్షాకాలంలో ఆహార పదార్థాలను నిల్వ చేయడం అత్యంత కష్టం. ఎందుకంటే పురుగులు పట్టడం లేదా తొందరగా పాడైపోవడమో జరుగుతుంది. ముఖ్యంగా బియ్యం వంటి పెద్ద మొత్తంలో ఉండే వాటిని నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి.
బియ్యంలో గడ్డలు లేదా పురుగులు కనిపించినంత మాత్రాన ఆ బియ్యాన్ని పారవేయకూడదు. బియ్యాన్ని పూర్తిగా ఎండబెట్టి, జల్లించి లేదా శుభ్రం చేసిన తర్వాత సురక్షితంగా ఉపయోగించవచ్చు. సాధారణంగా బియ్యపు పురుగు బియ్యపు గింజలో నేరుగా ఒక చిన్న రంధ్రం చేస్తుంది. అది ఆ తర్వాత ఆ రంధ్రంలో ఒక గుడ్డు పెట్టి, ఒక ప్రత్యేక పదార్థంతో దాన్ని మూసివేస్తుంది.
కొన్ని రోజుల తర్వాత, గుడ్డు నుంచి లార్వా బయటకు వస్తుంది. ఆ తర్వాత అది గింజ లోపల నివశిస్తూ..దాన్ని తింటూ పెరుగుతుంది. దాంతో అది బియ్యపు గింజలా బయటకు కనిపించినా..లోపల బోలుగా ఉంటుంది. చివరకు ఆ బియ్యం గింజ నుంచి బయటకు వచ్చే సమయాలనికి బియ్యం మొత్తం పొడిపొడిగా, పిండిగా కనిపిస్తాయి. ఇలా జరగకూడదంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరి. మరి అవేంటో చూసేద్దామా.!.
ఎలా చెక్‌పెట్టాలంటే..
బియ్యంలో పురుగులు (వీవిల్స్) ఉన్నట్లు గమనిస్తే, ముందుగా దానిని ఒక పెద్ద పళ్ళెంలో పరచి, 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో ఉంచండి. ప్రకాశవంతమైన వెలుతురు, వేడి వల్ల చాలా వరకు పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత పురుగులను జల్లెడ ద్వారా లేదా చెరగడం ద్వారం వేరు చేయాలి. ఆ తర్వాత స్పష్టంగా రంధ్రాలు లేదా గుంటలు ఉన్న బియ్యపు గింజలను ఏరివేయండి!.
వండడానికి ముందు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి. పురుగులు మళ్లీ రాకుండా ఉండటానికి, శుభ్రం చేసిన బియ్యాన్ని 48 గంటల పాటు ఫ్రీజర్‌లో
బిర్యానీ ఆకులు (తేజపత్ర), వేప ఆకులు, ఎండు మిరపకాయలు, పసుపును వంటి వాటితో దీనికి చెక్ పెట్టొచ్చు.
అలాగే బియ్యాన్ని ఎప్పుడూ..గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి.
ఒకవేళ అప్పటికే పురుగులు పట్టి ఉంటే..బియ్యాన్ని గోరువెచ్చని నీటితో రెండు మూడు సార్లు శుభ్రం చేయండి. దీనివల్ల పురుగులు చనిపోతాయి.
బిర్యానీ ఆకులు, వెల్లుల్లి రెబ్బలు లేదా ఎండిన వేప ఆకుల వంటి సహజ పదార్థాలు వాటి బలమైన వాసన, ఔషధ గుణాలతో సహజంగా కీటకాలను తరిమికొట్టడానికి (నిరోధకంగా) సహాయపడతాయి.
వర్షాకాలంలో బియ్యం నిల్వ చేసే తొట్టెల్లో వీటిని 3 నుండి 5 శాతం వేస్తే సరిపోతుంది. ఇవి కీటకాలకు నచ్చని బలమైన సువాసనను వెదజల్లుతాయి, కాబట్టి మీ ధాన్యం ఎటువంటి రసాయన అవశేషాలు లేకుండా తాజాగా మరియు పురుగుల బారి నుండి రక్షించబడుతుంది.
లవంగాల ఆకులు, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు లేదా ఎండిన వేప ఆకుల వంటి సహజ పదార్థాలు వాటి బలమైన వాసన మరియు ఔషధ గుణాలతో సహజంగా కీటకాలను తరిమికొట్టడానికి (నిరోధకంగా) సహాయపడతాయి.
(చదవండి: తామర పువ్వులు తినడం వల్ల నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా? నిపుణులు ఏమంటున్నారు)


