నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి | Kitchen Tips: How To Store Lemon So They Stay Fresh For Many Days - Sakshi
Sakshi News home page

Kitchen Tips: శాండ్‌ విచ్‌ రుచిగా రావాలంటే ఇలా చేయండి

Published Thu, Aug 24 2023 10:34 AM

Kitchen Tips: How To Store Lemon Fresh For Many Days - Sakshi

కిచెన్‌ టిప్స్‌
ఒక్కో నిమ్మకాయను అల్యూమినియం ఫాయిల్‌ల్లో చుట్టి రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. 
► శాండ్‌ విచ్‌ మరీ మెత్తగా కాకుండా చక్కగా రావాలంటే... శాండ్‌ విచ్‌లో పెట్టే కూరగాయలు, బ్రెడ్‌ మయనేజ్, చీజ్‌ గది ఉష్ణోగ్రతలో ఉండేలా చూసుకోవాలి.
ఇంతకు మించి వేడిగా ఉండే తేమ చేరి శాండ్‌విచ్‌ మెత్తగా మారిపోతుంది. 
► కొన్నిసార్లు పన్నీర్‌ ముక్కలు ఫ్రై చేసిన తరువాత గట్టిగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు పన్నీర్‌ ముక్కలు ఫ్రై చేసిన తరువాత చల్లని నీటిలో ఐదు నుంచి పదినిమిషాలు ఉంచాలి. తరువాత కూరలో వేస్తే పన్నీర్‌ ముక్క మృదువుగా, మెత్తగా ఉంటుంది. 
► ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేసి ఉంచితే, వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరి నీరు కారిపోకుండా ఉంటుంది.
► కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిసరిన్ కలిపితే కేకు ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.
► బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడిపొడిగా ఉంటుంది.
► పులిహోరలో వేరుశనగగుళ్ళు కరకరలాడుతూ ఉండాలంటే విడిగా నూనెలో వేయించండి. అన్నంలో తాలింపు వేశాక, వేడితగ్గాక, అప్పుడు వేరుశనగగుళ్ళు కలపండి. పులిహోర రుచిగా ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement