పెయిన్‌ లెస్‌ ఎలక్ట్రిక్‌ షేవర్‌.. సాధారణ ట్రిమ్మర్లకు ఇది భిన్నం

Key Features Of Professional Hair Trimmer - Sakshi

బ్యూటీజర్‌ 

చాలామంది ఆడవారు మెచ్చే డ్రెస్‌ కంఫ్టర్ట్స్‌లో  స్లీవ్‌లెస్‌ టాపులు.. త్రీ బై ఫోర్త్‌ ప్యాంట్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇంకాస్త ట్రెండీ లుక్‌ కోసం బాక్సర్స్, షార్ట్స్‌ వాడకం కూడా పెరిగింది. దాంతో చేతులు, కాళ్లు, అండర్‌ ఆర్మ్స్‌ నూగు లేకుండా నీట్‌గా ఉంచుకునే తాపత్రయమూ ఎక్కువైంది. ఈ క్రమంలో పార్లర్లకు పరుగు తీయడమూ కామన్‌ అయిపోయింది. అయితే పెయిన్‌ ఫుల్‌ వ్యాక్సింగ్‌ కంటే.. ట్రిమ్మర్‌ బెటర్‌ అనే వాళ్ల కోసమే ఈ డివైజ్‌ (రీచార్జబుల్‌ హెయిర్‌ రిమూవర్‌).

ఈ పెయిన్‌ లెస్‌ ఎలక్ట్రిక్‌ షేవర్‌.. అవాంఛిత రోమాలను పూర్తిగా తొలగించి, చర్మ మృదుత్వాన్ని కాపాడుతుంది. అలాగే నొప్పి తెలియకుండా వెంట్రుకులను తొలగిస్తుంది. శరీరంలో ఎక్కడైనా సరే దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. దాంతో చేతులు, కాళ్లు, అండర్‌ ఆర్మ్స్, బికినీ లైన్‌ ఇలా మొత్తం క్లీన్‌ చేసుకోవచ్చు. ఈ డివైజ్‌ చూడటానికి మౌస్‌లా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. చార్జింగ్‌ పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. దీని అడుగు భాగంలో నాలుగు ట్రిమ్మింగ్‌ హెడ్స్‌ ఉంటాయి. సాధారణ షేవింగ్‌లో మాదిరి చర్మం గరకుగా మారకుండా చూస్తుంది. దీని ధర మూడు వేల రూపాయల పైమాటే.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top