'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా? | I'm Fine Syndrome: Put off self-care and giving rise | Sakshi
Sakshi News home page

'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా?

Jun 3 2026 10:45 AM | Updated on Jun 3 2026 11:10 AM

I'm Fine Syndrome: Put off self-care and giving rise

నేను బాగానే ఉన్నాను..అనేది సానుకూలమైన ధోరణి అనుకుంటాం. కానీ అది ఎంతలా మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేలా చేస్తుందో తెలిస్తే విస్తుపోతారు. నిజానికి ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నామని వైద్యుల, మానసిక నిపుణులు సైతం ముందుగా గుర్తించలేరట. మనకు ఎవరైనా మీరు ఎలా ఉన్నారు? అనగానే ఐమ్‌ ఫైన్‌, థాంక్యూ అని నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. కానీ ఈ సమాధానమే పెద్దయ్యాక సర్దుబాటు పద్ధతిగా మారి మానసిక క్షోభగా పరిణామం చెందుతోందని గుర్తించమని చెబుతున్నారు నిపుణులు. ఇదేంటని విస్తుపోకండి. అసలు ఏంటి సిండ్రోమ్‌..బాగున్నా అన్నా ధోరణి ఇంత ప్రమాదకరంగా ఎలా మారుతుందంటే..

ఈ సిండ్రోమ్‌ మనల్ని మభ్యపెట్టి బతికేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక వ్యక్తి క్షోభకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను విస్మరించి అంతా తన అధీనంలో ఉండాలనే ధోరణినే 'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్ అంటారట. మస్తత్వవేత్తలు ఇది ఒక రకమైన లక్షణాలను అంగీకరించకుండా.. భావోద్వేగాలను అణిచివేసే స్థితిగా చెబుతున్నారు. దీనివల్ల ఆయా వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగాలని భావించి, తమలోని ఆందోళన సంకేతాలను తక్కువగా అంచనా వేస్తారు లేదా విస్మరిస్తారని అంటున్నారు. 

అంతేగాదు ఈ 'నేను బాగానే ఉన్నాను' అనేది కేవలం మామూలుగా చెప్పే సమాధానం కాదు. అదొక సర్దబాటు విధానంగా మారిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యే ఇదని అంటున్నారు. అంటే వృత్తిరీత్యా సమావేశాలు, టార్గెట్లు, అదనపు వర్క్‌ని పరమావధిగా చూస్తూ..భోజనం మానేయడం, నిద్రలేని రాత్రలు, నిరంతర అలసట, భావోద్వేగపరమైన నీరసం వంటి హెచ్చరిక సంకేతాలను విస్మరిస్తూ..అంతా తమ అధీనంటో ఉందన్నట్లు పనులు చేస్తుంటారని చెబుతున్నారు మానసిక నిపుణుల. 

ఇక్కడ జీవించడం లేదు కేవలం పోటీ పడుతున్నాం. ఫలితంగా స్వీయం సంరక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామని అంటున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక ఆరోగ్య సమస్యలు గురించి ఆలోచించ్చని అనుకుంటూ..తెలియకుండానే ఆ భయానక వలయంలో కూరుకుపోతారని అంటున్నారు. అంతేగాదు దీని కారణంగా అనారోగ్య అలవాట్ల బారిన పడతారని కూడా అంటున్నారు. 

ఈ సిండ్రోమ్‌ సంకేతాలు..

నిద్రలేమి
ఏకాగ్రత లోపం
జ్ఞాపకశక్తి సమస్యలు
వైద్యపరంగా వివరించలేని ఆకలి లేదా బరువులో మార్పులు
పనిలో ఉత్పాదకత తగ్గడం
సామాజిక ఒంటరితనం
అభిరుచులపై ఆసక్తి లేకపోవడం
చిరాకు
ఆవేశపూరిత ప్రవర్తన
తరచుగా వచ్చే తలనొప్పులు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు,అలసట వంటి శారీరక అనారోగ్యాలు

ఈ లక్షణాలు ఒక్కోసారి ఆపీసు లేదా కార్యాలయాల్లో తమ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయినప్పుడూ కూడా ఈ పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్‌ ఉందంటున్నారు. దీనివల్ల సాధారణ పనులు కూడా చేసుకోలేని విధంగా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. నిజానికి నిరాకరణ నుంచి  'నేను బాగానే ఉన్నాను' అనే సిండ్రోమ్‌ వస్తుందట. మానసిక నిరాకరణ అనేది తరుచుగా భయం, సామాజిక కండిషనింగ్‌ నుంచి పుడుతుందని అంటున్నారు. 

చాలామంది తాము బలంగా ఉండాలని, సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని ఇతరులకు భారం కాకూడదని భావిస్తూ పెరుగుతారు. అది కాస్తా తమ బాధను అంగీకరించడానికి ఇబ్బందిపడే మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ మనం బాధను అంగీకరిస్తే బలహీనంగా కనిపిస్తామని సిగ్గుపడి చివరకి నిరాకరణ ధోరణి మొదలవ్వుతుందని అంటున్నారు. 

అందుకే భావోద్వేగాలను అణిచివేయొద్దు, బాధ, ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులను అంగీకరించి వాటి నుంచి బయటపడే మార్గం చూడండి తప్ప అణిచేసేలా బాగానే ఉన్నాను అనే మాటకు ఆస్కారం ఇవ్వకండి. ఇక్కడ బాగానే ఉన్నాను అను మాటకు కట్టుబడి ఉండేలా స్వీయ భద్రతపై దృష్టిపెట్టండి, ఆరోగ్యాన్ని పట్టించుకోండి..తర్వాత అనే మాటకు అవకాశం ఇవ్వొద్దు అని సూచిస్తున్నారు మానసిక నిపుణులు.

 

(చదవండి: ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..! అతడి చివరి భోజనం..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement