తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్‌..! కట్‌చేస్తే.. | IIT-JEE Rejection Once Crushed Him He Gifted His Father BMW | Sakshi
Sakshi News home page

తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్‌..! కట్‌చేస్తే..

Jun 8 2026 9:57 AM | Updated on Jun 8 2026 10:39 AM

IIT-JEE Rejection Once Crushed Him He Gifted His Father BMW

చాలామంది కెరీర్‌లో చాలా ఓటములు, నిరాశను ఎదుర్కొన్నవారే. ఆశించినట్లుగా ఉన్నత చదువును అందుకోలేక..నచ్చలేంది చదవలేక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇతరులు సాధిస్తే..తానొక్కడే ఫెయిల్‌ అవ్వడం, ప్రతిదాంట్లో నిరాశ, నైరాశ్యం వెంటాడుతుంటే కుంగిపోతాం. కానీ ఇక్కడ ప్రయత్నం ఆగిపోకూడదు. ఈ రోజు ఫెయిల్‌ అయ్యి ఉండొచ్చేమో కానీ ఏదో ఒకరోజు తప్పక ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటాం అనేందుకు ఈ వ్యక్తే కథే ఉదాహరణ. నెట్టింట అతడి స్టోరీ వైరల్‌గా మారడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది.

వ్యవస్థాపకుడు, కంటెంట్‌ క్రియేటర్‌ అంకుర్‌ వారికూ సోషల్‌మీడియా వేదికగా 26 ఏళ్ల శౌర్య శిఖర్‌ విజయవంతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఇది మొక్కవోని స్థైర్యంతో చివరికి సక్సెస్‌ని ఒడిసిపట్టుకున్న అందమైన విజయగాథ. ఐదేళ్ల క్రితం వరకు శౌర్య కెరీర్‌లో సెటిల్‌ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డ వ్యక్తి. అతను అందరిలా ఐఐటీ-జేఈఈ సాధించాలని కలలుగన్న వ్యక్తి.  అయితే అతడు అందులో సక్సెస్‌ అవ్వలేకపోయాడు. 

తన తండ్రి ఐఐటీ అయ్యి ఉండి, తాను సాధించలేక పోవడం అతడ్ని మరింత కుంగదీసింది. తీవ్ర నిరాశతో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) డిగ్రీలో జాయిన్‌ అయ్యాడు. అదీ చదవలేక నానా పాట్లు పడ్డాడు. ఆ క్రమంలో ఏకంగా 110 కేజీల అధిక బరువుతో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. కాలేజ్‌లో చదువుతున్నప్పుడే శౌర్య అంకుర్‌ వారికూ బృందంలో చేరాడు. కానీ శౌర్య నిరాశ, కెరీర్‌లో అనిశ్చితి, వ్యక్తిగత పోరాటాల మధ్య చిక్కుకుని తనకు భవిష్యత్తు అనేది ఉందా అని భయపడుతుండేవాడు. 

చెప్పాలంటే తను ఎందుకు పనిరానని భావంతో ఉండేవాడు. తనకెంతో ఇష్టమైన ఇంజనీరింగ్‌ కోర్సు చేయలేకపోయానని, బీబీఏ చేస్తున్న ఫూల్‌ని అని బాగా బాధపడేవాడు. ఇక ఎప్పటికీ తన లైఫ్‌ మంచిగా ఉండదేమో అని దిగులుతో ఉండేవాడు. కట్‌చేస్తే..సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో శౌర్య మంచి కెరీర్‌ను నిర్మిచుకుని నెలకు లక్షల్లో జీతం ఆర్చించే స్థాయికి చేరుకున్నాడు. 

అంతేగాదు తన తండ్రి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఏకంగా రూ. 55 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారుని కొనిచ్చాడు. విలాసవంతమైన కారు కోసం చెల్లించిన డౌన్ పేమెంట్ శౌర్య నికర ఆస్తిలో 5% కంటే తక్కువగా ఉందని, అలాగే ఈఎంఐ అతని నెలవారీ సంపాదనలో 7% కంటే తక్కువగా ఉంటుందని వారికూ వెల్లడించారు. అతనిలో వచ్చిన మార్పు కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, ఏళ్లు గడిచే కొద్దీ..శౌర్య ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి ఫిట్‌గా మారాడు. ఇక్కడ శౌర్య కథ విలాసవంతమైన కారు, సంపద గురించి చెప్పడం లేదు. 

ఎదురు దెబ్బలు ఒక వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశించవు, జీవితంలో ఒక దశ దారుణమైన వైఫల్యం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అదే క్రమంగా విభిన్నమైన మార్గానికి నాంది పలికి ఉన్నతమైన స్థానానికి చేరుకునేలా చేస్తుంది అనేందుకు శౌర్యనే ఉదాహరణ. కానీ ఇక్కడ జీవితంలో ఎదురయ్యే గడ్డుపరిస్థితులకు చేతులెత్తేయకుండా ముందుకు సాగడమే జీవితం అని నమ్మి..ప్రయత్నం ఆపకూడదనేది గ్రహించాలని అంటున్నారు అంకుర్‌ వారికూ. 

అలాంటి స్థితిలో ధైర్యంగా ముందుకు సాగినవాడు తప్పకుండా ఏదో ఒకనాటికి జీవితం మంచిగా సెటిల్‌ అవుతుందని అన్నారు. ఈ స్టోరీ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..అత్యంత నిరాశ నిస్ప్రుహల మధ్య ఆశావాదం హాస్యస్పదంగా అనిపించినా.. ఇక్కడ శౌర్య కార్యాచరణలో నిమగ్నమే ముందుకు సాగాలనే దృక్పథాన్ని ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా..ముందుకు సాగే వారే విజేతలు అని కామెంట్‌ చేస్తూ పోస్టలు పెట్టారు.

(చదవండి: చాయ్‌-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఏమన్నారంటే..)

 

Advertisement
 
Advertisement
Advertisement